Begin typing your search above and press return to search.

రెండో లేఖ రాసిన జైళ్ల శాఖ డీఐజీ రూప‌!

By:  Tupaki Desk   |   15 July 2017 1:24 PM GMT
రెండో లేఖ రాసిన జైళ్ల శాఖ డీఐజీ రూప‌!
X
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శ‌శిక‌ళ‌కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ట్రీట్ మెంట్ క‌ల్పించేందుకు జైళ్ల శాఖ డీజీపీ స‌త్య‌నారాయ‌ణ 1.5 కోట్లు లంచం తీసుకున్నార‌ని ఆమె ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క‌ సీఎం సిద్ధ‌రామయ్య విచార‌ణకు ఆదేశించారు. దీంతో, రిటైడ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో విచారణ మొదలైయ్యింది. నెల‌రోజుల లోపు సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని విన‌య్ కుమార్ కు సిద్దరామయ్య సూచించారు.

ఈ వ్య‌వ‌హారంపై సీఎం విచార‌ణ‌కు ఆదేశించ‌డాన్ని డీఐజీ రూప స్వాగతించారు. అయితే, తాజాగా రూప మ‌రో అధికారిపై ఉన్న‌తాధికారుల‌కు, ప్ర‌భుత్వానికి రెండో లేఖ రాయ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ జైలర్ కృష్ణకుమార్ ను విచారణ చేసి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.

జైళ్ల శాఖ డీఐజీ రూప నివేదిక మీడియాకు ఎలా లీక్ అయ్యింద‌నే కోణంలో విచారణ చెయ్యాలని వినయ్ కుమార్ నిర్ణయించారని తెలిసింది. శశికళ - అబ్దుల్ తెల్గీ విషయంలో వాస్త‌వాలేంటి? వ‌ఆరికి ఎలాంటి సౌకర్యాలు కల్పించార‌నే అంశంపై ఆయ‌న విచార‌ణ చేయ‌నున్నార‌ని వినికిడి. ఆ ఇద్ద‌రి బ్యార‌క్ ల‌లోని మిగ‌తా ఖైదీలను విచారణ చెయ్యాలని వినయ్ కుమార్ నిర్ణయించారని తెలిసింది.

వినయ్ కుమార్ ఆదివారం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకునే అవకాశం ఉంది. దీంతో, డీజీపీ సత్యనారాయణ హ‌డావిడిగా జైలు దగ్గరకు వెళ్లారు. జైలును శుభ్రం చేయించి అక్క‌డ వీవీఐపీ సౌకర్యాలు మొత్తం తీసివెయ్యాలని సిబ్బందికి సూచించారని కన్నడ మీడియాలో వార్తలు వ‌చ్చాయి.