Begin typing your search above and press return to search.
పెద్దనోట్లు.. ఎవరికి ఎలాంటి కష్టం!
By: Tupaki Desk | 9 Nov 2016 4:12 AM GMTమంగళవారం సాయంత్రం టీవీ చూసిన వాళ్లు - బుదవారం ఉదయం పేపర్ చూసినవారికి ఒక భారీ షాక్... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రద్దు అని! ఈ నిర్ణయం వల్ల నల్లదనం, పెద్దలు ఇరుకున పడటం వంటి సంగతులు కాసేపు పక్కనపెడితే... తన స్థాయిలో సామాన్యుడికీ కొన్ని కష్టాలను ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు కొంత వరకు ఇబ్బందులు తప్పక పోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో విత్ డ్రాస్ పై పరిమితి విధించడంతోపాటు పాత నోట్లను మార్చుకొనేందుకు అనేక పరిమితులు విధించడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడనున్నారు. వాటి సంగతులేమిటో ఇప్పుడు చూద్దాం...
నెల ప్రారంభమై వారం రోజులే కావడంతో చాలా మంది ఇంటి ఖర్చులకు, ఇతర అవసరాలకు నగదు డ్రా చేసి ఉంటారు. ఈ క్రమంలో చాలా సాధారణంగా వారి వద్ద 500 - 1000 నోట్లే ఉంటాయి. ఇలాంటి వారూ రెండు రోజులు ఆగి, వాటిని మార్చుకొనేందుకు బ్యాంకులకు పరిగెత్తాల్సి ఉంటుంది. కానీ ఈ రెండు రోజులూ 500 - 1000 తప్ప మరో నోటు దగ్గర లేకపోతే ఇబ్బందులు మామూలుగా ఉండవు!
ఈ విషయంలో గ్రామ ప్రాంత ప్రజలు - బ్యాంకులు అందుబాటులోలేని ఊర్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే... దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల గ్రామాలు ఉన్నాయని అంచనా. కానీ ప్రతి గ్రామంలోనూ బ్యాంకులు లేవు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు పెద్ద నోట్ల మార్పిడిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. దీంతో అన్ని పనులు మానుకొని కొన్ని రోజులపాటు సమీప ప్రాంతాల్లోని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పదు!! ఈ క్రమంలో విహార యాత్రలకు - ఆఫీసు పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తమ వద్ద పెద్ద నోట్లను మాత్రమే ఉంచుకుని ఉంటారనడంలో సందేహం ఉండదు! ఈ సమయంలో అలాంటి వారికి ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించంతో తమ వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకొనేందుకు వీరు నానా ఇబ్బందులు పడనున్నారు.
ఇదే క్రమంలో కిరాణా దుకాణాలు - చిన్న హోటళ్లు నిర్వహించే వారి వద్ద రోజువారీ ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకొని నాలుగు రోజులకోసారో - వారానికోసారో బ్యాంకుల్లో జమ చేస్తుంటారు. అందులో నుంచే తమ వద్ద పనిచేసే వారికి రోజువారీగా చెల్లింపులు చేస్తుంటారు. అలాగే, కాంట్రాక్టర్లు సైతం రోజువారీ కూలీలకు చెల్లించేందుకు భారీగా పెద్ద నోట్లను తమ వద్ద ఉంచుకుంటారు. వీరందరికీ ఇబ్బందులు ఎదురవనున్నాయి! ఇలా... కిరాణా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేయాలన్నా - క్యాబ్ లో ప్రయాణించి డబ్బులు చెల్లించాలన్నా వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. బుధవారం బ్యాంకులకు సెలవు కావడంతో వీరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను తక్షణం మార్చుకొనే అవకాశమూ లేదు.
ఈ రేంజ్ లో పెద్దనోట్ల వల్ల చిన్న చిన్న కష్టాలు చిన్నవాళ్లకు కొంతకాలం తప్పదు మరి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/