Begin typing your search above and press return to search.

జిల్లాల్లో ఎక్కువ.. తెలంగాణలో తక్కువ.. కేసుల్లో తేడా?

By:  Tupaki Desk   |   20 July 2020 3:00 PM GMT
జిల్లాల్లో ఎక్కువ.. తెలంగాణలో తక్కువ.. కేసుల్లో తేడా?
X
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ లో ఆయా జిల్లాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయన్న ప్రచారం బాగా సాగుతోంది.. కానీ ఆ జిల్లాల వైద్యశాఖ బులిటెన్ లో ఎక్కువ కేసులు చూపిస్తున్నారంటున్నారు. ఈ మతలబేంటో అర్థం కాక చాలామంది జుట్లు పీక్కుంటున్నారు. ఎందుకీ వ్యత్యాసం? ఎందుకింత తేడా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బహుషా అందరూ హైదరాబాద్ వచ్చి పరీక్షలు చేయించుకోవడం.. అవి ఇక్కడా నమోదు కావడంతో జిల్లాల్లో వారిని వేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు సమాచారం. కానీ జిల్లా ఆరోగ్యశాఖలు వారిని హైదరాబాద్ వాసులుగా కాకుండా జిల్లా వాసులుగానే కౌంట్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే రాష్ట్ర బులిటెన్ కు జిల్లా బులిటెన్ కు తేడా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం.. తక్కువ కేసులను నివేదించడంతో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు జోక్యం చేసుకొని హెచ్చరించడం.. ప్రతిపక్ష విమర్శల తరువాత టిఆర్ఎస్ సర్కార్ పరీక్ష సామర్థ్యాన్ని పెంచింది. చేస్తున్న టెస్టులను.. ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే దానిపై వివరాలను తాజా బులిటెన్ లో వెల్లడిస్తున్నారు.

ఇంకా తెలంగాణ ప్రభుత్వం కొత్త కరోనా కేసులను తక్కువ సంఖ్యలో నివేదిస్తోంది. గత రాత్రి ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌తో ఇది మళ్లీ బహిర్గతమైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. రాష్ట్ర బులెటిన్లో, ఖమ్మం.. నల్గొండ జిల్లాల్లో వరుసగా 5 మరియు 26 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కాగా ఖమ్మం, నల్గొండ అధికారులు విడుదల చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (డిఎంహెచ్‌ఓ) బులెటిన్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం డిఎంహెచ్ఓ జిల్లా నుండి 37 కేసులను నమోదు చేయగా, నల్గొండ అధికారులు ఆదివారం 69 కొత్త కేసులను నమోదు చేశారు. కరోనా కేసుల గణనలో ఈ వ్యత్యాసాలపై అధికారుల నుండి స్పష్టత రావాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

చాలా మంది వైద్య నిపుణులు మొదటి నుంచి కొత్త కేసులను నివేదించడంలో నిర్లక్ష్యం వల్లే ఈ గందరగోళం నెలకొందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే వైరస్ వ్యాప్తికి దారితీస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో టెస్టులు చేయించుకున్న ఇతర జిల్లాల వారిని ఆ జిల్లాల్లో కూడా చూపించడం వల్లే ఈ కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.