Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కేసుల్లో భారీ తేడా.. దాచేస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 July 2020 7:50 AM GMT
ఏపీలో కరోనా కేసుల్లో భారీ తేడా.. దాచేస్తున్నారా?
X
పక్కనున్న తెలంగాణలో రోజుకు 2వేల వరకు కేసులు నమోదు అవుతుండగా.. ఏపీలో రోజుకు 1000 దగ్గరే ఆగిపోతోంది. తీవ్రత కంట్రోల్ లోనే ఉందని అధికారులు అంటున్నారు. కానీ జిల్లాల్లో వెలుగుచూస్తున్న కేసులకు.. రాష్ట్ర స్థాయి హెల్త్ బులిటెన్ కు చాలా తేడా ఉండడంతో ఏపీలో కరోనా కేసులు దాచేస్తున్నారా అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి కరోనా హెల్త్ బులిటెన్ కు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే హెల్త్ బులిటెన్ కు పొంతన లేకపోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు పదుల సంఖ్యలో కరోనా కేసుల విషయంలో రాష్ట్రస్థాయికి.. జిల్లా స్థాయి హెల్త్ బులిటెన్లకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.

తాజాగా బుధవారం నాటి ఏపీ రాష్ట్ర స్థాయి హెల్త్ బులిటెన్ లో ప్రకాశం జిల్లాలో కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.కానీ ప్రకాశం జిల్లా వైద్య అధికారులు వెల్లడించిన కరోనా బులిటెన్ లో 110 పాజిటివ్ కేసులు వచ్చినట్లుగా తెలిపారు. ఇంత భారీ తేడా ఎందుకొచ్చిందని.. కరోనా కేసులను దాచేస్తున్నారా అన్న ఆందోళనను జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం వెల్లడించే కేసులకు.. క్షేత్రస్థాయిలో కేసులను చాలా తేడా ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నింటిని వెల్లడించాలని.. ఏపీలోని కరోనా తీవ్రతను ప్రజలకు తెలుపాల్సిన బాధ్యత ఉందని ప్రజలు కోరుతున్నారు. దాచడం వల్ల మరింతగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.