Begin typing your search above and press return to search.
మన్మోహన్ లో లేనిది..మోడీలో ఉన్నది చెప్పాడు
By: Tupaki Desk | 10 Jan 2017 5:28 AM GMTఅతడో ట్యాక్సీ డ్రైవర్. కానీ.. ఇప్పుడు అతని మాటలు జాతీయ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకుకారణం లేకపోలేదు. మాజీ ప్రధాని.. మేధావిగా సుపరిచితుడైన మన్మోహన్ సింగ్ లో లేనిది.. అందరి మదిని దోచుకునే ప్రధాని మోడీలో ఉన్నదేమిటో చెప్పుకొచ్చిన యూపీ కార్ డ్రైవర్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ప్రధానిగా పదేళ్లు పాలించినా సగటు జీవి మనసుల్ని మన్మోహన్ గెలుచుకోలేకపోయారన్నఅపప్రద ఆయన మీద ఉంది. ఎందుకలాంటి భావన ప్రజల మదిలో పడిందన్న విషయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు చెందిన 29 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ రాఘవేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. ఒక మీడియా సంస్థ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకొచ్చారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాలన్నీఇంగ్లిషులో ఉండేవని.. వాటినితన లాంటి గ్రామీణులు అర్థం చేసుకోలేకపోయేవారని చెప్పారు. కానీ.. ప్రధాని మోడీ విషయంలో మాత్రం అందుకుభిన్నమైన పరిస్థితి అని.. ఆయన ప్రసంగాలన్నీ చక్కగా హిందీలో ఉంటాయని.. అందుకే.. ఆయన ప్రసంగాల్ని వింటున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేసిన నోట్ల రద్దు ఉదంతం.. యూపీ ఎన్నికల్లోనూ కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. నోట్ల రద్దుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని.. ఇది తమకు సానుకూల అంశంగా విపక్షాలు భావిస్తుంటే.. అందుకు భిన్నమైన వాదనను బీజేపీ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. నోట్ల రద్దుపైనా రాఘవేంద్ర సింగ్ మాట్లాడారు. అతడి విశ్లేషణ ప్రకారం.. నోట్ల రద్దు నిర్ణయం పేదలపై పెద్దగా ప్రభావం చూపిందచలేదన్నారు. పేదల వద్ద నోట్ల రద్దుకు ముందు డబ్బులేదని.. నోట్ల రద్దు తర్వాత కూడా డబ్బు రాలేదని.. అసలు డబ్బే లేనప్పుడు వారి మీద ప్రభావం ఎందుకు ఉంటుందని? ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం గ్రామీణులు సైతం పేటీఎంను వినియోగిస్తున్నారని..మొబైల్ ద్వారా కూడా చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా బడా వ్యాపారులు.. సంపన్నులకు ఇబ్బందిని కలిగించిందని చెప్పాడు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరుగుతుందని.. ఆ మొత్తంతో సంక్షేమ కార్యక్రమాలు భారీగా జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం విశేషం. యూపీలోని సగటు జీవి ఆలోచనలు ఎలా ఉన్నాయన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/