Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు.. కేజ్రీవాల్ కు ఎంత తేడా!
By: Tupaki Desk | 29 Oct 2019 9:37 AM GMTతెలంగాణలో ఆర్టీసీ సంక్షోభం ముదిరింది. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ దాన్ని ప్రయివేటు పరం చేయడానికి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఉద్యోగాలేమీ శాశ్వతం కాదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వం భరించలేదా అని హైకోర్టు కూడా ప్రశ్నించింది. మరోవైపు ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని.. విద్యార్థులకు పాస్ లు - ఇతర వర్గాలకు రాయితీలు కల్పించి ప్రజల మెప్పు పొందుతున్న ప్రభుత్వం అందువల్ల ఆర్టీసీకి కలుగుతున్న నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీరు ఇలా ఉండగా దేశ రాజధాని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరు అందుకు భిన్నంగా ఉంది. దిల్లీలో మహిళలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రోజు నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభించింది. అయితే, అలా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల దిల్లీ ఆర్టీసీకి కలిగే నష్టాన్ని భరించడానికి కేజ్రీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా ఎంత మంది మహిళలు ప్రయాణిస్తున్నారు.. దిల్లీ ఆర్టీసీ తమ వల్ల ఎంత ఆదాయం కోల్పోతుందో కచ్చితంగా లెక్కకట్టడానికి ఓ విధానం ప్రవేశపెట్టింది.
బస్సెక్కే మహిళలకు ఆర్టీసీ కండక్టర్లు గులాబీ రంగు టికెట్ ఇస్తారు. ఇది ఫ్రీ టికెట్.. దీనికోసం ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. మరెందుకీ టికెట్ అనుకోవద్దు... ఇలాంటివి ఎన్ని టికెట్లు జారీ అయితే అంతమంది మహిళలు ప్రయాణించినట్లు లెక్క. ఆ లెక్కలు ప్రభుత్వానికి సమర్పిస్తే వారు అందుకు తగిన మొత్తాన్ని ఆర్టీసీకి జమ చేస్తారు.
అంతేకాదు.. బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం కేజ్రీ ప్రభుత్వం ఇప్పటికే 3400 మంది మార్షల్స్ ను బస్సుల్లో నియమించింది. ఇప్పుడు ఉచిత ప్రయాణం నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య మరింత పెరిగొచ్చన్న అంచనాతో మార్షల్స్ సంఖ్యను 13 వేలకు పెంచింది దిల్లీ గవర్నమెంట్.