Begin typing your search above and press return to search.

'పవిత్రపతి’ ని కట్టుకుంటే వైరస్ సోకదట !

By:  Tupaki Desk   |   16 Jun 2020 2:30 AM GMT
పవిత్రపతి’ ని కట్టుకుంటే వైరస్ సోకదట !
X
‘పవిత్రపతి'...అంటే పవిత్రమైన భర్త అనుకుంటే పొరపాటు పడ్డట్టే. పవిత్రపతిని కట్టుకుంటే వైరస్ సోకదు అనగానే ..పవిత్రమైన భర్తను కట్టుకుంటే వైరస్ సోకదు అని అనుకునేరు...అసలు ఈ ‘పవిత్రపతి’ ఏంటీ అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..

ప్రస్తుతం ఈ వైరస్ దెబ్బకి ‘మాస్క్’ ప్రధాన రక్షణకవచంగా మారిపోయింది. ఈ వైరస్ నుంచి కాపాడుకోవటానికి మార్కెట్ లో చాలా రకాల మాస్కులే వస్తున్నాయి. ఈ మాస్క్ కట్టుకుంటే కరోనా సమస్యే ఉండదనే మాటలు వింటున్నాం. ఈ క్రమంలో కెమికల్ మాస్కులకు బదులుగా వనమూలికలను రంగరించి కొత్తరకం మాస్క్ సిద్ధం చేసింది పుణేలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ

దీని తయారీలో వేపనూనె, పసుపు, తులసి, నల్లమిరియాలు, గంధపుచెక్క, కుంకుమపువ్వు వంటి వాటిని వినియోగించారు. మూడు పొరలతో రూపొందించిన ఈ మాస్కుకు ‘పవిత్రపతి’ అని పేరు పెట్టారు. ఈ మాస్క్ యాంటీ బ్యాక్టీరియల్ అని, యాంటీ వైరల్‌గా, యాంటీ ఫంగల్‌గానూ ఇది పనిచేస్తుందని డీఐఏటీ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ తెలిపారు. ఈ మాస్కు తయారీకి మూడు కంపెనీలు తమను సంప్రదించినట్టు పేర్కొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మాస్కును తయారుచేసినట్టు ఆయన వివరించారు.