Begin typing your search above and press return to search.

పొట్ట రాకుండా ఉండేందుకు మన పూర్వీకులు పాటించిన డైట్...

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:30 PM GMT
పొట్ట రాకుండా ఉండేందుకు మన పూర్వీకులు పాటించిన డైట్...
X
ప్రస్తుత ఆధునిక జీవన విధానంతో ఉరుకుల పరుగుల ఆరాటంలో మనుషులు ఫుల్ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. దాంతో పాతికేళ్లకే యూత్ అనారోగ్యాల బారిన పడుతున్నారు. పాతికేళ్లు మాత్రమే కాదు పిల్లలు కూడా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం. కాగా, ప్రధానమైనది ఫుడ్. నాడు మన పూర్వీకులు తీసుకునే ఆహారంలో బలవర్ధమకమైన ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండేవి. కానీ, నేడు అలాంటి పరిస్థితులు లేవు. ఫుడ్ అంతా దాదాపుగా కల్తీ అయ్యే పరిస్థితులున్నాయి. ఇక జంక్ ఫుడ్ అనగా ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్‌కు జనాలు బాగా అలవాటు పడిపోయారు. దాంతో ప్రతీ ఒక్కరికి పొట్ట కామన్‌గా వచ్చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే అధిక బరువు వచ్చేసి ఊబకాయులు అవుతున్నారు. వారు ఇక వెయిట్ తగ్గించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మన పూర్వీకులు అవలంభించిన ఈ పద్ధతిని పాటిస్తే వెయిట్ కంపల్సరీ లాస్ అవొచ్చట. అదేంటంటే.. పూర్వీకుల్లో పొట్ట రాకపోవడానికి కారణం వారు అరటి పండుతో కూడిన ఆహార పదార్థాలను బాగా తీసుకునేవారట. బనానాలో కేలరీలు చాలా తక్కువ కానీ చాలా ఫైబర్ ఉంటుంది. అయితే, అరటిని యాజ్ ఇట్ ఈజ్‌గా కంటే కూడా రసం లాగా తయారు చేసుకుని తీసుకుంటే మంచి ఫలితముంటుందట. బనానా జ్యూస్ అని దీనిని పిలవచ్చు. దీనిని తాగడం ద్వారా ఎక్కువ సేపు అస్సలు ఆకలి అనిపించదు. ఫలితంగా హ్యూమన్ బాడీ వెయిట్ కంట్రోల్ అవడంతోపాటు కొవ్వు నియంత్రణలోకి వస్తుంది.

ఇకపోతే ఈ బనానా జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వలన, ఇది కణాలలో నిల్వ చేయబడిన చక్కెరలు, కొవ్వుల విడుదలను తగ్గించేస్తుంది. ముఖ్యంగా హ్యూమన్ బాడీలోని కొవ్వును తొలగించడానికి సహాయపడే ఫైబర్ రకాన్ని ఈ అరటి రసం కలిగి ఉంటుంది. ఇకపోతే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడం అరటి రసం బాగా సాయపడుతుంది. మనిషి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి మూత్ర నాళాన్ని క్లియర్ చేయడానికి అరటి రసం అద్భుతమైన ఆహారం. ప్రధానంగా అరటి రసానికి మూత్రపిండాల్లోని కిడ్నీ స్టోన్‌లను కరిగించి, విసర్జించే సామర్థ్యం పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపర్చడంలో అరటి రసం కీలక పాత్ర పోషిస్తుంది. బనానాలోని ఫైబర్ క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

ఫలితంగా వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. అరటి పండు రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే.. ఒక అరటికాయను.. చిన్న, చిన్న ముక్కలుగా తరగాలి, దానికి ఒక కప్పు నిమ్మరసం, ఒక కప్పు తాగు నీరు, చెంచడు ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత దానిని తాగాలి. ఇలా ప్రతీ రోజు అరటి పండు రసం తాగడం ద్వారొ పొట్ట అసలే రాదట. ఆయుర్వేదం ప్రకారం.. అరటి పండు రసాన్ని తాగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఈజీగా కరిగిపోతాయట. అరటి పండు రసంగా మాత్రమే కాకుండా మీ రోజు వారీ ఆహారంలో విడిగానైనా చేర్చడం ద్వారా మంచి ఫలితాలుంటయాట. ఇక ఊబకాయులు అరటి పండు రసం తాగడం ద్వారా ఆకలి తగ్గిపోయి బరువు ఆటోమేటిక్‌గా తగ్గిపోతారు.