Begin typing your search above and press return to search.
మారడోనా ఆస్తి ఎవరి పాలు.. భార్య కాక ఐదుగురు ప్రియురాళ్లు..!
By: Tupaki Desk | 2 Dec 2020 3:46 AM GMTఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నిజానికి మారడోనా ఫుట్‌బాల్ చరిత్రలో ఓ సంచలనం. తన విన్యాసాలతో యావత్ ప్రపంచాన్ని అలరించాడు. మారడోనా వ్యక్తిగత జీవితం కూడా ఎంతో వివాదాస్పదంగా గడిచింది. తన క్రీడా విన్యాసాలతో ఎంతో పేరు గడించాడో..! కానీ వ్యక్తిగతంగా చేసిన కొన్ని పనుల వల్ల అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. డ్రగ్స్‌కేసులో ఇరుక్కొని అబాసుపాలయ్యాడు. అయితే అతడి మరణాంతరం కూడా వివాదాలు ముసురుకున్నాయి.
మారడోనా వీలునామా రాయకపోవడమే ఇందుకు కారణం. అతడికి ఆరుగురు ప్రియురాళ్లు.. ఎనిమిది మంది సంతానం ఉన్నారు. మారడోనా కు మొత్తం ఇండియన్ కరెన్సీలో రూ. 700 కోట్ల ఆస్తి ఉన్నది. ఇప్పుడా ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి. మారడోనా అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా, సాకర్ జట్టు మేనేజర్‌గా సేవలు అందించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. మొత్తం ఆరుగురు పాట్నర్లతో ఆయన తన జీవితం పంచుకున్నాడు. వారివల్ల ఎనిమిది మంది సంతానం కలిగారు.
వీలునామా రాయకపోవడంతో ఇప్పుడు ఆస్తి ఎవరికి అందుతుంది అన్న విషయం వివాదాస్పదంగా మారింది. వాహనాలు, ఆభరణాలు, ఇన్వెస్ట్‌మెంట్లు.. అన్నీ కలిపి సుమారు రూ.700 కోట్ల ఆస్తి ఉండొచ్చని అంచానా. మారడోనా తన చిన్ననాటి స్నేహితురాలు క్లాడియాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కూతుర్లు పుట్టారు. వారి పేర్లు గియానియా, దాల్మా. 2003లో క్లాడియాతో భేదాభిప్రాయాలు రావడంతో ఆమెకు విడాకులిచ్చాడు.
అయితే.. అంతకుముందు నుంచే ఇటలీ గాయని క్రిస్టియానాతో అతడికి సంబంధం ఉంది. ఆమె ద్వారా 1986లో అతడు డీగో జూనియర్‌ను సంతానంగా పొందాడు. మారడోనాకు సెబాలైన్ అనే మరో ప్రేయసి ఉంది. ఆమెతో కొంతకాలం సహజీవనం చేశాడు. 1996లో ఆమెకు జానా అనే అమ్మాయి పుట్టడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత వెరోనికా అనే మరో మహిళతో సహజీవనం చేశాడు. 2013లో ఆమె డీగో ఒజేడాకు జన్మనిచ్చింది. డ్రగ్స్‌కు బానిసైన మారడోనా.. ఆ వ్యసనం నుంచి బయటపడటం కోసం కొంత కాలం క్యూబాలో గడిపాడు. ఆ సమయంలో కనీసం ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడని అతడి న్యాయవాది తెలిపాడు. ఇప్పుడు వీళ్లంతా మారడోనా ఆస్తికోసం పోరాడుతున్నారు. అయితే మారడోనా మాత్రం తనకు కేవలం ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారని గతంలో ప్రకటించాడు. తాను తన ఆస్తిని సంతానానికి ఇవ్వబోనని.. దానధర్మాలు చేస్తానని కూడా ప్రకటించాడు.