Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు గంటలకే మృతి ... !

By:  Tupaki Desk   |   1 Feb 2021 3:30 PM GMT
వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు గంటలకే మృతి ... !
X
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. ఇదే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రాంతాల్లో దుష్ప్రభావాలు గుజరాత్ ‌లోని వడోదరాలో ఆదివారం కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు గంటలకే 30 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు మృతి చెందాడు. వ్యాక్సిన్‌ తీసుకున్నందునే చనిపోయాడని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, మరణానికి ఖచ్చితమైన కారణనాన్ని నిర్ధారించేందుకు పోస్టుమార్టం కోసం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

అతని హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయని, గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. వడోదరకు చెందిన జిగ్నేష్‌ సొలంకి స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. కరోనా టీకా డ్రైవ్‌ లో భాగంగా ఉదయం టీకా తీసుకున్నాడు. కొద్ది సమయం తర్వాత ఇంటికి వెళ్లగా సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే కుటుంబీకులు ఎస్‌ ఎస్ ‌జీ హాస్పిటల్ ‌కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

సొలంకి భార్య దివ్య మాట్లాడుతూ తన భర్త టీకా తీసుకోబోతున్నాడని తనకు తెలియదని చెప్పింది. టీకా వేసిన తర్వాత ఇంటికి వచ్చాడని, కూతురితో ఆడుకుంటూ పడిపోయాడని చెప్పింది. మరణానికి టీకానే కారణమని అనుమానిస్తున్నట్లు తెలిపింది.

కరోనా‌ టీకా సెంటర్‌ లో వ్యాక్సిన్‌ ఇచ్చారని, ఆ తర్వాత అరగంట పాటు పర్యవేక్షించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, అతని హాస్పిటల్‌ లోనే చనిపోయినట్లు పేర్కొన్నారు. జిగ్నేష్‌ ఏడాదిన్నర కిత్రం ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో చేరాడని, తాము తెలుసుకున్నామని, గుండెజబ్బుల చరిత్ర ఉన్నందున గుండుపోటు కారణంగా మరణించే అవకాశం ఉందని తెలిపారు.

జిగ్నేష్‌ 2016 నుంచి హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం మందులు తీసుకోవడం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 12వేల మంది ఫ్రంట్ ‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చామని, ఇందులో ఎవరూ ఆరోగ్య సమస్యలపై ఫిర్యాదు చేయలేదని వీఎంసీ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ దేవేష్‌ పటేల్‌ వివరించారు.