Begin typing your search above and press return to search.
దీదీ సోదరుడి సంచలనం.. పార్టీ మారే ముందు ఈ మాత్రం ఉండదా?
By: Tupaki Desk | 15 Jan 2021 1:30 PM GMTఅప్పటివరకు మంచిగా కనిపించింది కాస్తా చెడ్డగా మారిపోవటం రాజకీయాల్లోనే సాధ్యం. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోనున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు.. మజ్లిస్ మరోవైపు మమతకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న పరిస్థితి. దీదీ పార్టీకి చెందిన పలువురు నేతల్ని టార్గెట్ చేసిన బీజేపీ.. ఆ పార్టీ నుంచి వలసల్ని తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. దీంతో.. ఏ నిమిషాన ఎవరు జంప్ అయిపోతారన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.
వాళ్లు.. వీళ్లు ఎందుకు.. ఏకంగా ముఖ్యమంత్రి మమత సోదరుడికే టార్గెట్ చేస్తే సరిపోలేదనుకున్న బీజేపీ.. ఇప్పుడాయనకు గాలం వేసింది. కమలనాథుల ప్రపోజల్ కు మమత సోదరుడు ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనప్పటికీ.. రానున్న రోజుల్లో ఆయన పార్టీ మారటం ఖాయమంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్న మమత సోదరుడు కార్తీక్.. ప్రజల స్థితిగతులు మెరుగవ్వాలని చెప్పటం గమనార్హం. తన సోదరి ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో ప్రజల స్థితిగతులు మెరుగు కావాలని కోరుతున్న ఆయన.. కుటుంబ సభ్యుల డెవలప్ మెంట్ కోసం రాజకీయనాయకుల పట్ల విసుగు వచ్చినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఆయన్ను సీఎం మమతను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటే ఆయన మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల్లో వంచన గురించి మాట్లాడుతున్నానని.. రాజకీయ ప్రజల స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మొదట ప్రజల గురించి ఆలోచించిన తర్వాతే కుటుంబం గురించి ఆలోచించాలన్నారు. చూస్తుంటే.. ఎంత త్వరగా కమలం గూటికి వెళ్లాలన్న ఆయన తీరు ఉందంటున్నారు. మరి.. బీజేపీలోకి వెళుతున్నారా? అంటే.. నో చెప్పలేదు.. అలా అని ఎస్ కూడా చెప్పకపోవటం గమనార్హం.