Begin typing your search above and press return to search.

టీడీపీ సైలెంట్‌: బాబు టీంకి.. జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   21 July 2021 11:30 AM GMT
టీడీపీ సైలెంట్‌: బాబు టీంకి.. జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారా?
X
రాజ‌కీయంగా.. సీఎం జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎప్పుడూ ముందుండే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియా `ఒక కీల‌క ప‌రిణామం` త‌ర్వాత కూడా సైలెంట్గా ఉండ‌డం, సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా.. ఎలాంటి విమ‌ర్శ‌లూ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యానికి తావిస్తోంది. వైసీపీ త‌ర‌ఫున గెలిచి, త‌ర్వాత జ‌గ‌న్‌పై దండెత్తుతున్న ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజు వ్య‌వ‌హారంపై జ‌గ‌న్ ప్రభుత్వం రెండు విధాల షాకిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక‌వైపు ఆయ‌న పార్ల‌మెంటు స‌భ్య‌త్వాన్ని.. ర‌ద్దు చేయించేలా స్పీక‌ర్‌కు అన‌ర్హ‌త పిటిష‌న్ ఇచ్చింది. మ‌రోవైపు.. సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం.. అరెస్టు.. బెయిల్.. తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఎంపీ ర‌ఘురామ వెనుక‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా ఆయ‌న అనుకూల మీడియా ఉంద‌ని.. ప్ర‌భుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి.. కేసు కూడా న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ సుప్రీంలో సాగుతోంది. ఈ క్ర‌మంలో ర‌ఘురామ‌పై తాము ఎందుకు కేసు న‌మోదు చేయాల్సి వ‌చ్చిందో.. ఇత‌ర మీడియా సంస్థ‌ల‌పైనా ఎందుకు కేసు పెట్టామో.. చెప్పే క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. దీనిలో.. ర‌ఘురామ `వేషాలు` ఎన్ని ఉన్నాయో.. అన్నిం టినీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పేర్కొంది. ప్ర‌భుత్వాన్ని ఏ విధంగా అస్థిర ప‌ర‌చాలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన తీరును సుప్రీం ముందు ఆధారాల‌తో స‌హా వెల్ల‌డించింది.

అదేస‌మ‌యంలో ర‌ఘురామ‌కు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ధ్య సాగిన వాట్సాప్ చాటింగులు, టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి లోకేష్‌తో ర‌ఘురామ‌కుసాగిన ఫోన్ సంభాష‌ణ‌ల‌ను కూడా సీఐడీ పోలీసులు.. సుప్రీం కోర్టుకు అఫిడ‌విట్ రూపంలో అందించారు. ఇది... బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్‌లో ఉంచ‌డంతో దేశం మొత్తానికి ర‌ఘురామ వ‌ర్సెస్ చంద్ర‌బాబు నాట‌కం తెలిసిపో యింది. అయిన‌ప్ప‌టికీ.. ఇంత జ‌రిగిన‌ప్ప‌టికీ.. టీడీపీ నుంచి ఏ ఒక్క నాయ‌కుడు కూడా ప‌న్నెత్తు మాట అన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఇలాంటి లీకులు వ‌చ్చిన‌ప్పుడు టీడీపీ అనుకూల మీడియా స‌హా.. చంద్ర‌బాబు ఆదేశాల‌తో చోటా మోటా నేత‌లు కూడా లైన్‌లోకి వ‌చ్చేసి.. మైకులు ప‌గిలిపోయేలా కామెంట్లు చేస్తారు.

కానీ, తాజా ప‌రిణామంలో మాత్రం.. చంద్ర‌బాబు నుంచి లోకేష్ వ‌ర‌కు.. అచ్చెన్న నుంచి.. గోరంట్ల వ‌ర‌కు ఎవ‌రూ మాట్లాడ‌లేదు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. మీడియాతో మాట్లాడిన ర‌ఘురామ‌.. ``నా పోన్ నా ఇష్టం. ఎవ‌రికైనా మెసేజ్‌లు పెట్టుకునే స్వేచ్ఛ నాకుంది!`` అని వ్యాఖ్యానించ‌డం.. చూస్తే.. బాబు-ర‌ఘురామల మ‌ధ్య జ‌రిగిన చాటింగ్ త‌దిత‌రాలు నిజ‌మ‌నే సంకేతాలు అందిస్తున్నాయి. ఇదిలావుంటే, ఈ ప‌రిణామాల‌పై టీడీపీ మౌనంగా ఉండ‌డం దీనికి ఖండించ‌క‌పోవ‌డం కానీ, ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కానీ, లేదా తాము చాటింగ్ చేయ‌లేద‌ని.. చెప్ప‌డం కానీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.


అంటే.. ప్ర‌భుత్వం వేసిన అఫిడ‌విట్‌లో త‌ప్పించుకునే అవ‌కాశం.. చంద్ర‌బాబుకు క‌నిపించ‌డం లేదు. దీంతో ఇది ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన నేప‌థ్యంలో అప్ప‌ట్లో ఓటుకునోటు.. ఇప్పుడు జ‌గ‌న్‌పై కుట్రల క్ర‌మంలో త‌న‌పై మ‌రింత విశ్వాసం స‌న్న‌గిల్లుంద‌నే వాద‌నతోనే ఆయ‌న ఈ విష‌యంపై సైలెంట్ అయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ప్ర‌తిప‌క్షానికి, దీని అనుకూల మీడియాకు జ‌గ‌న్ సైలెంట్‌గానే ఫీజులు పీకేయ‌డం గ‌మ‌నార్హం.