Begin typing your search above and press return to search.
యంగ్ లుక్ లో ఉన్న కేటీఆర్ ను చూశారా? చూస్తే మీరేం అడుగుతారో తెలుసా?
By: Tupaki Desk | 12 April 2021 12:30 AM GMTమీరు ఎప్పుడైనా యంగ్ గా ఉన్న కేటీఆర్ ను చూశారా? చాలామంది చూసి ఉండరు. తొలిసారి తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు మంత్రి కేటీఆర్. చూసినంతనే యంగ్ హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు దర్శనమిస్తారు. అందుకేనేమో.. ఆస్క్ కేటీఆర్ (#AskKTR) అంటూ ట్విటర్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఫన్నీగా అడిగిన ప్రశ్నలకు.. అంతే స్పాంటేనియస్ గా సమాధానాలు ఇస్తూ మనసుల్ని దోచేశారు.
తన ఫోటోను చూసిన ఒక అభిమాని.. కేటీఆర్ సర్.. మీరు హీరోలా ఉన్నారు. బాలీవుడ్.. హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ప్రయత్నించలేదా? అని అడగ్గా.. ‘‘బాలీవుడ్.. హాలీవుడ్.. మరీ పెద్ద చెట్టు ఎక్కిస్తున్నావ్’ అంటూ ఎమోజీతో తన రిప్లైను పోస్టు చేశారు. ‘జాతిరత్నాలు’ సినిమా ఎలా ఉందని అడిగితే.. చాలా బాగా నచ్చిందని.. పూర్తి హాస్యభరిత చిత్రమని కితాబునిచ్చారు. మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడిగితే.. అప్పుడు ద్రావిడ్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ అని బదులిచ్చారు.
కరోనా చెలరేగిపోయిన 2020లోనూ తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయని.. 2021 ఎలా ఉంటుందన్న ప్రశ్నకు.. తమ వంతుప్రయత్నం చేస్తాం సోదరా అని బదులిచ్చారు. సీఎం కేసీఆర్ న్యాయకత్వం.. స్థిరపమైన ప్రభుత్వం పెట్టుబడులు వచ్చేందుకు ప్రధాన కారణమన్నారు. అన్నా.. తెలంగాణ ప్రభుత్వ పథకాలన్నీ బాగున్నాయి.. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అని అడగ్గా.. తప్పకుండా నాయక్ అంటూ బదులిచ్చారు.
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి .. 2021లో తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా? అని అడిగితే.. అది మంచి ఆలోచన కాదన్నది తన అభిప్రాయంగా చెప్పారు. అదే సమయంలో..ఉండని గట్టిగా చెప్పకపోవటం గమనార్హం దీన్ని బట్టి చూస్తే.. పెరిగే కేసులకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండే వీలుందన్న సంకేతాన్ని ఇచ్చినట్లైంది. మరిన్ని వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కారు కోరింది.. అక్కడి నుంచి సమాధానం వచ్చిందా సర్? అని అడిగితే.. ప్రస్తుతానికి దాని గురించి తెలీదని సమాధానం ఇవ్వటం గమనార్హం. మరి.. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? అని అడిగితే.. ఇంకా లేదని బదులిచ్చారు.
సిద్దిపేట గురించి ఒక్క మాట చెప్పమని అడిగితే.. తలెంగాణలోని ఉత్తమ పట్టణాల్లో ఒకటిగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్.. కేరళలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా.. ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. తన కుమార్తెను హైదరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనుకుంటున్నానని.. ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం సరిపోవటం లేదన్న వ్యక్తి మాటకు స్పందించిన కేటీఆర్.. తాజా బడ్జెట్ లో ప్రభుత్వ పాఠశాలల కోసం రూ.2వేల కోట్లు కేటాయించామని.. త్వరలో పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు.