Begin typing your search above and press return to search.

స్కూల్ కు వెళ్లే వేళలో జగన్ ఎలా ఉన్నారో చూశారా?

By:  Tupaki Desk   |   9 Oct 2020 4:45 AM GMT
స్కూల్ కు వెళ్లే వేళలో జగన్ ఎలా ఉన్నారో చూశారా?
X
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని స్కూల్ విద్యార్థిగా చూశారా? అరే.. చూడలేకపోయామని ఫీల్ అవుతున్నారా? ఆ కోరికను తీర్చేశారు జగన్. తన తీరుకు భిన్నంగా వ్యవహరించిన జగన్ అందరిని ఆకర్షించారు. ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అచ్చం స్కూలుకు వెళ్లే విద్యార్థిగా మారిపోయిన సీఎం జగన్ తీరు అక్కడి వారందరిని విపరీతంగా ఆకట్టుకుంది. అంతేనా.. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. జేబులో పెన్ను.. భుజానికి బ్యాగు వేసుకొని.. స్కూలుకు వెళ్లే విద్యార్థిని తలపించిన సీఎం జగన్.. రోటీన్ కు భిన్నంగా ముఖానికి మాస్కు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

భుజానికి ప్రభుత్వం అందించే బ్యాగును వేసుకోవటమే కాదు.. పిల్లలతో కలిసి క్లాస్ రూంలో కూర్చొని.. వారితో కాసేపు సరదాగా గడిపేశారు. జగనన్న విద్యాకానుక కిట్ లో మూడు జతల యూనిఫారాలు.. ఒక జత బూట్లు.. రెండు జతల సాక్సులు.. బెల్టు.. ఒక సెట్ పాఠ్య పుస్తకాలు.. స్కూల్ బ్యాగు ఉంటాయి.
అబ్బాయిలకు స్కై బ్లూ కలర్ బ్యాగులు అందిస్తే.. అమ్మాయిలకు నేవీ బ్లూ బ్యాగులు అందించటం గమనార్హం. కరోనా నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడేసి మాస్కులు కూడా ఇచ్చారు. తాజా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో.. పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న జగన్.. సీఎం అన్న విషయాన్ని పక్కన పెట్టి.. పిల్లలతో కలిసిపోయిన వైనం అందరిని ఆకర్షించింది.