Begin typing your search above and press return to search.
మోడీతో కేసీఆర్ భేటీ ఫోటో చెప్పే విషయాలెన్నో
By: Tupaki Desk | 13 Dec 2020 4:27 AM GMTదాదాపు పద్నాలుగు నెలల క్రితం ప్రధాని మోడీని ఢిల్లీలో కలిశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కట్ చేస్తే.. శనివారం రాత్రి వేళలో ఆయనతో భేటీ అయ్యారు. ఇరువురు అగ్రనేతలు దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.ఇద్దరు మాత్రమే ఉన్న ఆ సమావేశ మందిరంలో ఏం మాట్లాడుకున్నది ఎవరికి తెలీదు. ఆ విషయాలు ఏమీ బయటకు రాలేదు. ప్రధానితో చర్చించిన విషయాలు ఇవే అంటూ సీఎం పేషీ నుంచి అనధికారిక ప్రెస్ నోట్ తప్పించి మరింకేమీ లేదు.
మరి.. మోడీ.. కేసీఆర్ మధ్య భేటీ ఎలా సాగిందన్న విషయాన్ని చెప్పే ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మామూలుగా చూస్తే.. ఈ ఫోటోలో పెద్ద ప్రత్యేకత ఏమీ కనిపించక పోవచ్చు. తరచి చూడాలే కానీ బోలెడన్ని విషయాలుకనిపిస్తాయి. ఈ భేటీని కాసేపు పక్కన పెట్టి.. కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తనకు పక్కనే ఉన్న కుర్చీలో ఆయన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఇప్పుడు అదే గదిలో మోడీని కలిశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
కట్ చేస్తే.. తాజా సమావేశంలో తనను కలిసిన కేసీఆర్ ను.. జగన్ మాదిరి పక్క కుర్చీలో కూర్చోబెట్టకుండా కాస్త దూరంలో ఉన్న నీలి సోఫాలో కూర్చోబెట్టటం గమనార్హం. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో .. అంటే పద్నాలుగు నెలల క్రితం ప్రధాని మోడీనితెలంగాణ సీఎం కలిశారు.ఆ సందర్భంలో పక్క సీట్లో కూర్చొబెట్టుకున్నన ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా దూరంగా ఉంచటం చూస్తే.. ఇద్దరు నేతల మధ్య పెరిగినదూరం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తన చేతలతో ఇవ్వాల్సిన సంకేతాన్ని ప్రధాని మోడీ ఇచ్చేశారా? అన్న సందేహం కలుగుక మానదు.