Begin typing your search above and press return to search.
ఎలెన్ మస్క్ కు ఆ సమస్య ఉంది మీకు తెలుసా? అందుకే అప్పుడప్పుడు అలా..!
By: Tupaki Desk | 13 May 2021 9:30 AM GMTఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలెన్ మస్క్ తనకు ఉన్న అరుదైన సమస్య గురించి వెల్లడించారు. అమెరికాలోని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను ఆస్పర్గర్స్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ట్విటర్లో ఆయన పెట్టే పోస్టులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
తాను ఈ సమస్య వల్ల అప్పుడుప్పుడు కొన్ని పోస్టులు పెడతానని... వాటిపై విమర్శలు వస్తాయని చెప్పారు. కానీ ఆ సమయానికి తన మెదడు పనితీరు అలా ఉంటుందని వివరించారు. ఆ పోస్టుల వల్ల కొందరు నొచ్చుకొని ఉంటారని అన్నారు. కానీ తాను ఎలక్ట్రిక్ కారు అనే ఆలోచనకు జీవం పోశానని, అంగారక గ్రహంపైకి మానవులను పంపించబోతున్నానని చెప్పారు. తన మెదడు ఇలాంటి గొప్ప ఆలోచనలూ చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇన్ని చేసిన తాను అసాధారణ వ్యక్తిని అని చెప్పుకొచ్చారు.
మరి దిగ్గజ వ్యాపారి బాధపడుతున్న అరుదైన సమస్య ఆస్పర్గర్స్ సిండ్రోమ్ అనేది ఓ మానసిక సమస్య. ఇది జీవిత కాలం ఉంటుంది. ఇది రకరకాలుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆటిజం సమస్యను పోలి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు గోప్యతపై పెద్దగా అవగాహన ఉండదు. ఏది బయటకు చెప్పాలి? ఏది చెప్పకూడదో తేల్చుకోలేకపోతారు. వీరి ఆలోచనలు చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇతరులతో కమ్యూనికేట్ అవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు చాలా సున్నిత మనస్తులు. త్వరగా భావోద్వేగానికి గురవుతారు.
పని పట్ల వీరికి చాలా శ్రద్ధ ఉంటుంది. సాధారణ వ్యక్తులకన్నా ప్రత్యేకంగా ఆలోచిస్తారు. వీరు ఒక పనిపై చాలా ఆసక్తి కనబర్చుతారు. దీనిపై కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ ప్రత్యేకతను సరిగా వినియోగించుకుంటే ఆ రంగంలో రాణించవచ్చు. ఇది కేవలం పురుషుల్లోనే కనిపిస్తుందని వైద్యులు తొలుత వెల్లడించారు. అనంతరం ఈ సమస్య మహిళల్లోనూ ఉంటుందని తేల్చారు.