Begin typing your search above and press return to search.
సారు చేసే యాగం ఎంత పెద్దదంటే?
By: Tupaki Desk | 31 July 2019 9:29 AM GMTఏం చేసినా భారీగా చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. తాను తీసుకునే నిర్ణయాలు భారీతనంతో ఉట్టిపడేలా ఉండేందుకు తపిస్తారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో వ్యవహరించటం ఆయనకు మాత్రమే సొంతం. ఐఆర్ పెంచాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న మొత్తంలో సగమో.. ముప్పాతికో ఇచ్చే దానికి భిన్నంగా వారు పది పైసలు అడిగితే తాను పన్నెండు పైసలు ఇస్తాననే తీరు గులాబీ బాస్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ముద్దు వచ్చినప్పుడు ఎంతా చంకనెక్కించుకుంటారో.. తేడా వస్తే అంతకు రెట్టింపు కసురుకోవటం ఆయనలో కనిపిస్తుంది.
సెంటిమెంట్లను.. వాస్తును భారీగా నమ్మే కేసీఆర్.. తాజాగా చినజీయర్ స్వామ వారి వద్దకు వెళ్లి యాదాద్రిలో తాను తలపెట్టిన డెవలప్ మెంట్ పనులు పూర్తి కావొస్తున్న వేళ.. భారీ యాగానికి సలహా కోరటం.. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన.. సుదర్శన యాగం చేయాలని చెప్పటం తెలిసిందే. దీంతో.. సదరు యాగానికి సారు సిద్ధమైపోతున్నారు. ఈ యాగం ఎంత భారీగా చేయనున్నారన్న విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఈ యాగానికి ఏకంగా వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్నారు.
ఇక.. 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు వేల మంది రుత్విక్కులు.. వారికి సాయంగా మరో 3వేల మంది సహాయకులు యాగంలో పాల్గొంటారు. అంటే.. యాగం చేసే వారే ఆరు వేల మంది అయితే.. వారికి సామాన్లు అందించటానికి.. వారికి అవసరమైన అన్ని పనులు చూసుకోవటానికి.. వారి బస.. భోజనం ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకెన్ని ఏర్పాట్లు చేయాలో మీ ఊహకే వదిలేస్తున్నాం.
పూజ చేసే పంతులగార్ల లెక్కే ఇలా ఉంటే.. ఈ యాగానికి భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను.. బద్రినాథ్.. శ్రీరంగం.. పూరీ జగన్నాథ్.. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రాల నుంచి మఠాధిపతుల్ని.. రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి.. ప్రధానమంత్రి.. కేంద్రమంత్రులతో సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లను.. ముఖ్యమంత్రులను.. మంత్రులను.. వివిధ సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి పిలవాలని డిసైడ్ చేశారు.
ఇంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో.. దీన్ని చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయంలోకి వెళితే.. చెబుతున్న లెక్క వింటే కళ్లు చెదిరిపోవాలంతే. ఒకవేళ కేసీఆర్ చెబుతున్నట్లుగా రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధాని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన పక్షంలో యాగానికి.. ప్రముఖులు వచ్చి వెళ్లేందుకు చేసే ఏర్పాట్లతో సహా మొత్తం ప్రోగ్రాంకు తక్కువలో తక్కువ రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఖర్చు ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ కార్యక్రమాన్ని మరింత భారీగా.. వసతులు ఫైవ్ స్టార్ రేంజ్లో చేస్తే మాత్రం.. మరో రెండు వందల కోట్లకు పైనా ఖర్చు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. కేసీఆరా మజాకానా?