Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులపై మంత్రి బొత్స ఏం చెప్పారో విన్నారా?

By:  Tupaki Desk   |   14 Jan 2021 3:11 AM GMT
ఏపీ అప్పులపై మంత్రి బొత్స ఏం చెప్పారో విన్నారా?
X
అప్పు లేనోడు ఈ ప్రపంచంలో ఉండరన్న మాట వాస్తవమే అయినా.. వెనుకా ముందు లేకుండా అప్పుల మీద అప్పులు చేయటం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో పాలకులు ప్రాధాన్యత అంశంగా గుర్తించరి పరిస్థితి. ఒకప్పుడు ప్రభుత్వం అప్పులు చేస్తున్నందనే.. విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తేవి.అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి.

ఏపీ విషయానికే వస్తే.. రికార్డు స్థాయిలో 20 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అప్పుల్ని తీసుకొచ్చినట్లుగా కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో.. రాష్ట్రం మీద మొత్తం అప్పుల భారం రూ.3.73లక్షల కోట్లు కావటం గమనార్హం. ఇంతలా అప్పులు చేయటం.. రాష్ట్రానికి మంచిది కాదన్న మాట ఈ మధ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. అప్పుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా చెప్పేస్తున్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

రాష్ట్రప్రభుత్వం అప్పులు చేస్తున్నదంతా అభివృద్ధి కోసమే కదా.. అవినీతికి పాల్పడేందుకు కాదు కదా?అన్న ఆయన ప్రజా సంక్షేమం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చటం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోందన్నారు.

ప్రజా శ్రేయస్సు కోసమే అనేక కార్యక్రమాల్ని చేపడుతున్నామని.. అందువల్లే అప్పులు పెరిగాయన్న ఆయన.. ఇది సహజ పరిణామంగా చెప్పేయటం ఆసక్తికరంగా మారింది. విపరీతంగా పన్నుల భారాన్ని ప్రజలపై మమోపుతున్నారంటూ ఏపీ విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోందని.. వైద్య.. విద్యా రంగంలో సమూల మార్పుల్ని తెచ్చుందన్నారు. ఏమైనా.. బొత్స లాంటి ధీమా ఉన్న నేతలు ఉన్నప్పుడు.. ఎన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. ధీమా అయితే సడలదనే చెప్పాలి.