Begin typing your search above and press return to search.

అసలు నువ్వు పరీక్షలు రాసి పాసయ్యవా లోకేష్?

By:  Tupaki Desk   |   26 Jun 2021 8:47 AM IST
అసలు నువ్వు పరీక్షలు రాసి పాసయ్యవా లోకేష్?
X
టీడీపీ భావి వారసుడు, చంద్రబాబు తనయుడు నారాలోకేష్ భాష పటిమ, తేటతెలుగుపై ఆయన ప్రసంగాలు చూస్తే చాలు నెటిజన్లకు బోలెడు మీమ్స్, ట్రోలింగ్ కు వీడియోలు దొరికేస్తాయి. అలాంటి లోకేష్ బాబుపై తాజాగా ఏపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్ చేశారు. పరీక్షలు రద్దయ్యాయని ఆనందం వ్యక్తం చేసిన లోకేష్ కు వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

పరీక్షలు రద్దు అయ్యాయని ఆనందపడటం తప్ప టీడీపీ నేత లోకేష్ కు మరొకటి తెలియదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఎద్దేవా చేశారు. పెద్దపెద్ద పదజాలాలు వాడి పరీక్షలకే మీరు పరీక్ష కాకండి అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ వంకతో విద్యార్థుల పరీక్షలపై రాజకీయాలు మాట్లాడడం లోకేష్ కు తగదని హితవు పలికారు.

శుక్రవారం పండుల రవీంద్రబాబు సూటిగా లోకేష్ ను టార్గెట్ చేశారు. ‘‘పరీక్షలంటే లోకేష్ కు అర్థం తెలుసా? మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా? చదువుకున్న వారికే పరీక్షల నిర్వహణ వెనుక అర్థం తెలుస్తుంది.. పరీక్షలు రద్దు అయ్యాయని సంతోషించడం తప్ప ఇంకేమైనా తెలుసా మీకు’ అని రవీంద్రబాబు ఎద్దేవా చేశారు.

పరీక్షల నిర్వహణతో విద్యార్థుల చదువుకు ఒక అర్థాన్ని ఇష్తుందని.. చదువుకున్న విద్యార్థులకు పరీక్షలంటే ఒక కిక్కు అని.. అలాంటి మీకు ఆ కిక్కు ఏం తెలుస్తుందని రవీంద్రబాబు లోకేష్ ను ఎద్దేవా చేశారు.. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన గొప్పదని.. కానీ కోవిడ్ వల్ల పరీక్షలు రద్దు చేయాల్సి రావడం చాలా దురదృష్టకరం అని రవీంద్రబాబు పేర్కొన్నారు.