Begin typing your search above and press return to search.
ఏపీ ఓటర్లకు వెంకయ్యనాయుడు హింట్ ఇచ్చారా...?
By: Tupaki Desk | 27 April 2023 9:11 AM GMTవచ్చే ఎన్నికలు ఏపీలో హోరా హోరీ పోరుకు దారి తీస్తాయని అంతా అంచనా కడుతున్నారు. అదే టైం లో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. బీజేపీ జనసేన మరో జట్టుగా ఉన్నారు. టీడీపీని కూడా కలుపుకుంటారా లేదా అన్నది తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు విజేత అవుతారు. ఏ పార్టీకి జనాలు పట్టం కడుతారు అన్నది అతి పెద్ద డిబేట్ గానే ఉంది.
రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన వెంకయ్యనాయుడు రాజ్యాంగ బద్ధ పదవులు కూడా చేపట్టి పదవీ విరమణ చేశారు.ఇపుడు ఆయన ప్రశాంత జీవితం గడుపుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు విరామం ప్రకటించాను పదవులకు విరమణ ప్రకటించాను కానీ పెదవులకు విరామం లేదు అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల వద్ద ఓట్లతో జనాలు జవాబు చెప్పాలని వెంకయ్యనాయుడు అనడం విశేషం. రాజకీయాలలో మంచి వారిని ఎన్నుకోవాలని ఆయన సూచిస్తున్నారు. రాజకీయాల పట్ల ప్రజలు విరక్తి పెంచుకోవద్దని, రాజకీయాలను మార్చాలని ఆయన కోరుతున్నారు.
వర్తమాన రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయాయని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని మార్చాల్సిన అవసరం బాధ్యత ప్రజల మీదనే ఉన్నాయని ఆయన అనడం గమనార్హం. అదే విధంగా మంచి వారిని ప్రజా సేవకులను ఎన్నుకోండి అని ప్రజలకు ఆయన పిలుపు ఇస్తున్నారు.
బూతులు మాట్లాడేవారు వద్దు అని వెంకయ్యనాయుడు పిలుపు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఆత్మీయ సమవేశం సందర్భంగా వెంకయ్యనాయుడు ఈ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా వెంకయ్యనాయుడు కామెంట్స్ వెనక అర్ధాలు ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. బూతులు మాట్లాడేవారు వద్దు అని అలాంటి నాయకులను ఎన్నుకోవద్దు అని ఆయన కోరడం కూడా ఆసక్తిని రేపుతోంది.
ఏపీ రాజకీయాల్లో ఇపుడు దాదాపుగా అందరు నేతలు ఏదో ఒక సందర్భంగా హద్దులు మీరి మాట్లాడుతున్నారు. కొందరు అయితే బూతులు అదే పనిగా వల్లిస్తున్నారు. మొదట ఎవరు స్టార్ట్ చేశారు అన్నది పక్కన పెడితే ఇపుడు వారూ వీరూ తేడా లేకుండా అంతా అదే బాటలో ఉన్నారు. మరి బూతులు మాట్లాడేవారిని వద్దు అని పెద్దాయన అంటున్నారు. దాన్ని బట్టి అధిక బూతులు మాట్లాడేవారినా లేక మొదట బూతులను స్టార్ట్ చేసిన వారి మీదనా అన్న చర్చ వస్తోంది.
అయితే ఎవరు ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారో ప్రజలకు ఇప్పటికే క్లారిటీ ఉందని, అదే విధంగా రాజకీయాల్లో అసభ్య భాష కూడా ఎపుడు ఎక్కువ అయిందో కూడా ఆ ట్రెండ్ ఎలా వచ్చిందో అన్న దాని మీద ప్రజలకు అవగాహన ఉందని అంటున్నారు.
అందువల్ల పెద్దాయన అలాంటి వారినే ఓడించమని హింట్ ఇచ్చేశారు అని కూడా అంటున్నారు. మొత్తానికి వెంకయ్యనాయుడు పెదాలకు విరామం ఇవ్వలేదు అంటూనే ఏపీ టూర్ కి వచ్చినపుడల్లా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇవి అర్ధం కావాల్సిన వారికి బ్రహ్మాండంగానే అర్ధం అవుతున్నాయని అంటున్నారు.