Begin typing your search above and press return to search.

ఒడిశా రైలు ప్రమాదం: ఆ 40 మంది షాక్ తో చనిపోయారా?

By:  Tupaki Desk   |   6 Jun 2023 6:01 PM GMT
ఒడిశా రైలు ప్రమాదం: ఆ 40 మంది షాక్ తో చనిపోయారా?
X
ఒరిస్సా లోని బాలాసోర్ సమీపం లో జరిగిన పెను రైలు ప్రమాదం గురించి ఇంకా అనేక వార్తలు తెరమీద కు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అనేక కారణాలు తెరమీద కు వచ్చాయి. కానీ దేన్ని ప్రామాణికంగా రైల్వే శాఖ నిర్ధారించలేదు ప్రస్తుతాని కి ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అనే అనుమానం తో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతాని కి ఈ రైలు ప్రమాద ఘటనను సిబిఐ కి అప్పగించింది.

ఇక ఒరిస్సాలో జరిగిన ఈ రైలు ప్రమాదం లో సుమారు 275 మంది మరణించగా అందులో 40 మృతదేహాల మీద ఎలాంటి గాయాలు లేవని ఒక పోలీసు అధికారి వెల్లడించిన వ్యవహారం తెరమీద కు వచ్చింది. తాము రైలు నుంచి తొలగించిన మృతదేహాల లో 40 మృతదేహాల మీద ఎలాంటి గాయాలు కానీ గుర్తులు గాని కనిపించలేద ని అంటే వారు కేవలం కరెంట్ షాక్ వల్ల చనిపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

నిజాని కి రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడి రైళ్లు విద్యుత్ సహాయంతో నడుస్తున్నాయి. అంటే ప్రతి రైలు ఇంజన్ కి పైన ఉన్న హై టెన్షన్ పవర్ సప్లై అందుతూ ఉంటుంది ప్రమాదం జరిగిన సమయం లో కోరమండల్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన ఇంజిన్ గూడ్స్ రైలు ఢీ కొట్టి ఆ రైలు ఎక్కేసిన సమయంలో కొన్ని కరెంటు తీగలు కూడా తెగిపోయాయి అని తెలుస్తోంది .

అందులోని కొన్ని తీగలు భోగిల కు తగిలి వాటి వల్ల విద్యుత్ ఘాతం జరిగినట్లుగా అభిప్రాయపడుతున్నారు అంటే 275 మంది మరణించగా వారి లో 40 మంది ఎలాంటి గాయాలు కాకపోయినా ఇనుప కడ్డీలు లేదా ఇతర లోహాల కు అతుక్కునే ఉండడంతో వాటి ద్వారా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు అనమాట.

ఇక ఈ రైలు ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా ఈ రైలు ప్రమాదాని కి సంబంధించిన వార్తలు ఏదో ఒక విషయం గురించి తెరమీద కు వస్తూనే ఉన్నాయి. రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కంటే మిస్సయిన వారు కూడా ఎక్కువగానే ఉండడం తో వారి కోసం గాలింపులు జరుపుతున్నారు.