Begin typing your search above and press return to search.
షెడ్యూల్ ప్రకటనలోనే టీఆర్ఎస్ గెలుపు కనిపించిందా?
By: Tupaki Desk | 17 Nov 2020 12:10 PM GMTనిజమే.. మీరు చదివింది కరెక్టే. ఎన్నికల షెడ్యూల్ విడుదలలోనే టీఆర్ఎస్ గెలుపు ఖాయమైనట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నికల నోటిఫికేషన్.. షెడ్యూల్ మధ్య కాస్తంత వ్యవధి ఉంటుందని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా చాలా తక్కువ వ్యవధిలోనే నోటిఫికేషన్ వెల్లడి కావటం.. అందులో నామినేషన్లకు ఇచ్చిన సమయం చాలా తక్కువగా ఉండటం టీఆర్ఎస్ కు మేలు కలుగుతుందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం ఉన్న గ్రేటర్ పాలక మండలి పదవీ కాలం ఫిబ్రవరితో కానీ ముగియదు. అంటే.. జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది. కానీ.. దాదాపు నెలన్నర ముందే ఎన్నికల్నినిర్వహిస్తున్నారు. ఎన్నికలకు మరికాస్త సమయం ఉందన్న ఉద్దేశంతో విపక్షాలు పెద్దగా సిద్ధం కాలేదు. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ గడిచిన ఆర్నెల్లుగా గ్రేటర్ ఎన్నికల పని మీదనే ఉందని చెప్పాలి.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ను చూస్తే.. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి (బుధవారం) మొదలు కానుంది. 20తో ముగుస్తుంది. అంటే.. నామినేషన్ల దాఖలకు కేవలం.. మూడు రోజులు మాత్రమే ఉంది. అధికార టీఆర్ఎస్ కు 100 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు ఉండటం.. మిగిలిన 40 మంది మజ్లిస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీకి ఏమాత్రం కష్టం కాదు.
విపక్షాల పరిస్థితి అందుకు భిన్నం. ఎందుకంటే..కాంగ్రెస్.. బీజేపీలకు అభ్యర్థుల ఎంపికకు కాస్త సమయం కావాలి. కానీ.. ఇప్పుడు మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. ఎంపిక కత్తి మీద సాములా మారుతుంది. హడావుడిగా ఎంపిక చేస్తే.. అనుకున్న ఫలితం వచ్చే వీల్లేదు.
అంతేకాదు.. సిట్టింగ్ అభ్యర్థుల్లో కొందరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న విషయం తెలిసిందే. అలాంటి వారు వేరే పార్టీల వైపు చూసి.. అక్కడకు వెళ్లేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తి అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఏతావాతా చూస్తే.. నామినేషన్లకు ఇచ్చిన గడువుతోనే టీఆర్ఎస్ పార్టీ ఎంచక్కా గెలిచేస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.