Begin typing your search above and press return to search.

అమెరికాలో సెకండ్​ వేవ్​ వచ్చేసిందా? ఒకేరోజు లక్ష కేసులు దేనికి సంకేతం!

By:  Tupaki Desk   |   1 Nov 2020 4:15 AM GMT
అమెరికాలో సెకండ్​ వేవ్​ వచ్చేసిందా? ఒకేరోజు లక్ష కేసులు దేనికి సంకేతం!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో మహమ్మారి సెకండ్​ వేవ్​ రూపంలో విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే అమెరికాలో లక్ష కొత్తకేసులు నమోదయ్యాయి. గతంలో అత్యధికంగా ఓ రోజు 91వేల కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటి లెక్కలు ఆ రికార్డును చెరిపేశాయి.

అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేసుల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండియాలో సెప్టెంబర్‌ నెల ఒక్కరోజులోనే 97వేల 894కేసులు నమోదై భయం పుట్టించింది. రెండ్రోజులుగా అమెరికాలో డైలీ ఇన్ఫెక్షన్లను బట్టి చూస్తుంటే సెకనుకో కేసు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ దేశంలో ఇప్పటివరకు 2లక్షల 30వేల మంది కోవిడ్​కు బలయ్యారు. జనాభాలో 3శాతం అంటే మొత్తం కలిపి 9మిలియన్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం.. 16 అమెరికా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పీక్స్ కు చేరుకున్నాయి. 13 రాష్ట్రాల్లో రికార్డు లెవల్స్ కు చేరుకుని కొవిడ్-19 పేషెంట్లు హాస్పిటలైజ్ అయ్యేలా చేశాయి. అక్టోబరులో 31 రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నవంబరు 3న ప్రెసిడెన్షియల్ ఎన్నిక ఒహియో, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వానియా, విస్కోన్సిన్ లో జరగనుంది. అమెరికాలో ఉండే ప్రతీ పదివేల మందిలో 272మందికి కరోనా వస్తుండగా ఏడుగురు వరకూ చనిపోతున్నారు. యూరప్‌లో ప్రతీ పదివేల మందికి 127 కేసులు నమోదవుతుండగా నలుగురు చనిపోతున్నారు. మరోవైపు యూరప్​లోని పలుదేశాల్లో లాక్​డౌన్​ విధించాలని అక్కడి ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ప్రాన్స్​లో లాక్​డౌన్​ కొనసాగుతోంది.