Begin typing your search above and press return to search.
ట్రంప్ తీరుపై సొంత పార్టీలోనే నిరసన మొదలైందా?
By: Tupaki Desk | 7 Nov 2020 5:30 AM GMTఓటమి ఎదురైనప్పుడు.. హుందాగా అంగీకరించటం.. మరో ప్రయత్నం చేస్తామని చెప్పటం చాలామంది అధినేతలకు అలవాటు. అందుకు భిన్నం ట్రంప్. అమెరికా అధ్యక్షుడి హోదాలో మరోసారి ఎన్నికల బరిలో దిగిన ఆయనకు.. ఓటమి తప్పేలా లేదు. ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకోవటం.. ఆయన అధిక్యతలో ఉన్న రాష్ట్రాల్లో సీన్ నెమ్మదిగా మారటం చూస్తే.. ఏదైనా అనుకోని అద్భుతం జరిగితే తప్పించి.. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ కావటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
తనకు ఎదురైన ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ సిద్ధంగా లేరంటున్నారు. ఇప్పటికే పలితంపై గుర్రుగా ఉన్న ఆయన.. కోర్టుల్ని ఆశ్రయిస్తామని చెప్పటం తెలిసిందే. ఈ తీరును ట్రంప్ సొంతపార్టీ నేతలే తప్పు పడుతున్నారు. ఓటమిని అంగీకరించే పని లేదని.. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం ఆయనపై ఒత్తిళ్లు అంతకంతకూ పెరుగుతున్నట్లుగాచెబుతున్నారు. బైడెన్ విజయం సాధించిన పలు చోట్ల కేసులు వేస్తామని చెబుతున్నప్పటి తుది ఫలితం స్పష్టమైతే మాత్రం ఈ అంశంపై వెనక్కి తగ్గే అవకాశం ఉందంటున్నారు.
ఎందుకంటే.. ట్రంప్ తీరును ఆయన లా టీంలోని వారు విభేదిస్తున్నారు. ఓటమిని హుందాగా వెల్ కం చెప్పాలని చెబుతుంటే.. మరికొందరు మాత్రం న్యాయపోరాటం చేయాలన్న మాటను చెప్పటం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫలితం ప్రతికూలంగా వస్తే.. ట్రంప్ తగ్గే అవకాశం ఉందని.. అప్పటివరకు మాత్రం అంతో ఇంతో రచ్చ చేయటం ఖాయమంటున్నారు.
విస్కాన్సిన్ లో రీకౌంటింగ్ కు దావా వేసిన ట్రంప్ వర్గీయులు.. మరిన్ని రాష్ట్రాల్లో అదే తరహాలో కేసులు వేయటానికి ట్రంప్ టీం సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే.. తన గెలుపును తానే డిక్లేర్ చేసుకోవటం ఏమిటన్న ఆగ్రహం ట్రంప్ సొంత పార్టీలోనే నెలకొనటం గమనార్హం. ట్రంప్ వ్యాఖ్యల్ని సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేయటంతో.. ఆయన వర్గం ఆత్మరక్షణలో పడినట్లుగా చెప్పాలి.
ట్రంప్ కు గట్టి మద్దతుదారుడైన క్రిస్ క్రిస్టీ మాట్లాడుతూ.. ట్రంప్ వాదనకు ఆధారాలులేవని..పోలైన ప్రతి ఓటునూ లెక్కించాల్సిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ దాడి చేశారని.. ఇది సరైన వ్యూహం కాదని.. రాజకీయంగా చెడ్డ నిర్ణయంగా ఆయన మండిపడ్డారు. ఓట్ల లెక్కింపు వేళ.. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం కామ్ గా ఉంటోంది.ఎందుకంటే 2024లో జరిగే ఎన్నికల్లో తమకుండే అవకాశాల్ని మెరుగుపర్చుకునేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరి లెక్కలు వారివి. ఎవరు మాత్రం వర్తమానంలో అడ్డగోలుగా మాట్లాడిన భవిష్యత్తును ఖరాబు చేసుకోరు కదా?