Begin typing your search above and press return to search.
రూ 11 కోట్ల భూమిని ఎంఎల్ఏ 3 కోట్లకు సెటిల్ చేశాడా ?
By: Tupaki Desk | 15 Dec 2020 12:08 PM ISTప్రకాశం జిల్లాలో ఓ ఖరీదైన భూమి సెటిల్మెంట్ విషయంలో అధికారపార్టీ ఎంఎల్ఏ తలదూర్చారా ? రూ. 11 కోట్ల విలువైన సదరు భూమిని కేవలం రూ. 3 కోట్లకే సెటిల్ చేసేశారా ? ఇపుడీ విషయంపైనే సదరు ఎంఎల్ఏ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఒకవైపేమో ఎటువంటి సెటిల్మంట్ల విషయంలోను అధికారపార్టీ నేతలను, ప్రజాప్రతినధులను జోక్యం చేసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి ఇఫ్పటికే చెప్పారు. తన ప్రభుత్వం అవినీతిరహిత ప్రభుత్వమని చెప్పుకోవటానికి కష్టపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఎంఎల్ఏలు మాత్రం తమిష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే మున్సిపాలిటి నియోజకవర్గంగా ఉన్న ఎంఎల్ఏ సోదరుడిదే అక్కడ ఇష్టరాజ్యమట. ఎక్కడ ఏ సెటిల్మెంట్ జరగాలన్నా ఎంఎల్ఏ తమ్ముడే చేయాలనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే మున్సిపాలిటి పరధిలోని ఓ 90 సెంట్ల స్ధలంలో యజమాని పేరుమీద 30 సెంట్లే ఉందట. మిగిలిన 60 సెంట్లు ఖరారు అగ్రిమెంటు మీదుందని సమాచారం. ఆ 60 సెంట్లను కూడా తన పేరుమీద పక్కా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సదరు ఓనర్ ప్రయత్నాలు మొదలుపెట్టారట.
ఇంకేముంది ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టడం ఆలస్యం ఆ విషయం ఎంఎల్ఏ తమ్ముడికి తెలిసిపోయిందట. వెంటనే సదరు ల్యాండ్ వివరాలు తీసుకుని వేరే వాళ్ళపేరుపై రిజిస్ట్రేషన్ చేయించేశారట. దాంతో అసలు ఓనర్ విషయం తెలుసుకుని లబోదిబో మన్నారని జనాలు చెప్పుకుంటున్నారు. ఏమి చేయాలో తెలీక అసలు ఓనర్ చివరకు ఎంఎల్ఏ సోదరుడి దగ్గరకు వచ్చారట. దాంతో ల్యాండు అసలు ఓనర్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళను కూర్చోబెట్టిన ఎంఎల్ఏ తమ్ముడు మొత్తం ల్యాండ్ ను రూ.3 కోట్లకు సెటిల్ చేశారట.
నిజానికి ఆ భూమి విలువ రూ. 11 కోట్లుందని తెలిసినా ల్యాండ్ ఓనర్ ఏమీ చేయలేకపోయారట. దక్కిందే దక్కుడన్న పద్దతిలో ఇచ్చిన డబ్బును తీసుకుని వెళ్ళిపోయారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తమ్ముడిని ముందుపెట్టుకుని ఎంఎల్ఏ ఇవే పనులు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ అడిగితే తన తమ్ముడితో తనకు సంబంధాలు లేవని ఎంఎల్ఏ చెప్పారట.
ఇపుడు డబ్బులు సంపాదించుకుంటే కానీ వచ్చే ఎన్నికల్లో ఖర్చుపెట్టడం సాధ్యం కాదని కూడా సదరు ఎంఎల్ఏ చెప్పుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. తాజా పంచాయితిలో ఎంఎల్ఏ సోదరునికి రూ. 6 కోట్లు ముట్టినట్లు సమాచారం. ఇదే విషయమై తుపాకీ. కామ్ ఆరాతీస్తోంది. తొందరలోనే వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం ఇంకెన్ని విషయాలు బయటపడతాయో.