Begin typing your search above and press return to search.

కేసీఆర్ గురించి వైసీపీలో చ‌ర్చ మొద‌లైందా...?

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:30 PM GMT
కేసీఆర్ గురించి వైసీపీలో చ‌ర్చ మొద‌లైందా...?
X
గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఏపీలో విజ‌యం ద‌క్కించుకునేందుకు పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ నుంచి సంపూ ర్ణ స‌హ‌కారం.. అందిన విష‌యం అందరికీ తెలిసిందే. దీనికి అప్ప‌ట్లో రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి చంద్ర‌బాబును గ‌ద్దె దించ‌డం.. రెండు జ‌గ‌న్ అదికారంలోకి వ‌స్తే... త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావించ‌డం. అందుకే ప్ర‌త్యేకంగా త‌న మంత్రుల‌ను కూడా ఏపీకి పంపించి మ‌రీ.. జ‌గ‌న్‌కు అనుకూలంగా చ‌క్రం తిప్పార‌ని.. కేసీఆర్ గురించి చెబుతారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితి ఉంటుందా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. ఉన్న ప‌రిణామాలు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా జగ‌న్ ఏపీలో అధికారం లోకి వ‌స్తే.. తెలంగాణ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని.. కేసీఆర్ భావించారు.ప్ర‌ధానంగా జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని అనుకున్నారు.

అయితే.. జ‌లాల విష‌యంలో జ‌గ‌న్‌కు కేసీఆర్‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. ఇవి ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా విభ‌జ‌న స‌మ‌స్య‌ల విష‌యంలోనూ.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు స‌మ‌సిపోయేందుకు జ‌గ‌న్ దోహ‌ద‌ప‌డ‌తార‌ని కేసీఆర్ అనుకున్నారు.

కానీ, అలా కూడా జ‌ర‌గ‌క‌పోగా.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ లేద‌ని.. జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. దీంతో కేసీఆర్‌కు.. జ‌గ‌న్‌కు మ‌ధ్య విభేదాలు అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అంత‌ర్గ‌తంగా .. జ‌గ‌న్ అంటే అభిమానం ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో ఆయ‌న‌కు స‌హ‌కారం.. అందిస్తే.. తెలంగాణ‌లో బ్యాడ్ సంకేతాలు ఇవ్వ‌డంతోపాటు.. బీజేపీ కూడా ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా తెలంగాణ‌లో అస్త్రంగా మార్చుకునే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

తెలంగాణకు ఏపీకి ద్రోహి అంటూనే..అక్క‌డ రాజ‌కీయాలు చ‌క్క‌బెడుతున్నాడ‌ని.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ద్వారా తెలంగాణ ప్ర‌యోజనాల‌కు గండి కొడుతున్న జ‌గ‌న్‌కు ఏపీలో కేసీఆర్ సాయం చేస్తున్నాడ‌నియాంటీ ప్ర‌చారం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇది కేసీఆర్‌కు ఓటు బ్యాంకు ఇష్యూగా మారే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ ఈ ద‌ఫా.. ఏమేర‌కు జ‌గ‌న్‌కు సాయం చేస్తార‌నేది వైసీపీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు.. త‌న ప‌థ‌కాలు ఉన్న‌ప్పుడు.. మ‌రొక‌రి సాయం ఎందుకు.. అనే ధోర‌ణిల‌నూ వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇది ఎటు తిరుగుతుందో చూడాలి.