Begin typing your search above and press return to search.
వివాదాస్పద స్వామీజీ విదేశాలకు జంప్ అయ్యారా?
By: Tupaki Desk | 22 Nov 2019 5:47 AM GMTవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు నిత్యానంద స్వామీజీ. ఆయన మీద వచ్చే ఆరోపణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తాజాగా ఆహ్మాదాబాద్ లోని నిత్యానంద ఆశ్రమంలో తమ ఇద్దరు కుమార్తెల్ని నిర్బందించారని.. వారిని విడిపించాలని వారి తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. దీంతో.. వారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకురావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఆహ్మాదాబాద్ లోని ఆశ్రమ ముఖ్యులపై కేసులు నమోదు చేయటంతో పాటు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అంతేకాదు.. మరింత సమాచారం కోసం నిత్యానందకు చెందిన బిడిదిలోని ధ్యానపీఠానికి పోలీసులు వెళ్లగా.. వారికి సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నిత్యానంద స్వామీజీ ఎక్కడ ఉన్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆయనపై ఉన్న పలు కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయినప్పటికీ గడిచిన ఆర్నెల్లుగా కోర్టు విచారణకు హాజరు కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. నిత్యానంద విదేశాలకు పారిపోయి ఉంటారా? అన్నది సందేహంగా మారింది.
ఇప్పటికే నిత్యానంద మీద పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి విచారణకు గడిచిన ఆర్నెల్లుగా కోర్టుకు హాజరు కావటం లేదని చెబుతున్నారు. పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన పాస్ పోర్టును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తన వద్ద పాస్ పోర్టు లేకున్నా దొంగ పాస్ పోర్టు సాయంతో విదేశాలకు చెక్కేసి ఉంటారని భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వ అధీనంలోని ఒక ద్వీపంలో నిత్యానంద ఉండి ఉంటారని భావిస్తున్నారు. నకిలీ పాస్ పోర్టు సాయంతో సముద్ర మార్గంలో ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ ఈ అనుమానమే నిజమై ఉంటే మాత్రం నిత్యానందకు పీకల్లోతు కష్టాల్లోకి చిక్కుకుపోయినట్లేనని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న కేసలుకు.. దొంగ పాస్ పోర్టుతో అక్రమంగా దేశం దాటి వెళ్లి ఉంటే.. ఆదో పెద్ద కేసు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న కేసులకు అదనంగా చేరే ఈ కేసుతో మరిన్ని తలనొప్పులు ఖాయమంటున్నారు.