Begin typing your search above and press return to search.
యాభై మందికి ఇవ్వను అని సీఎం చెప్పారా....?
By: Tupaki Desk | 5 April 2023 2:00 PM GMTరెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశం గురించి ఇంకా చర్చ సాగుతూనే ఉంది. సీఎం జగన్ ఏమి చెప్పారు అన్న దాని మీద హాట్ డిస్కషన్ అలా జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ అందరికీ భరోస అయితే ఇచ్చారు. నేను ఉన్నాను అన్నారు. మీ సంగతి చూసుకుంటాను అని చెప్పారు. అంతే కాదు, ఏ ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోను అని కూడా స్పష్టం చేశారు.
అలాగే కార్యకర్తను సైతం వదిలే ప్రసక్తి లేదని అన్నారు. తన రాజకీయం అంతా మానవ సంబంధాలంతోనే అని గట్టిగా చెప్పుకున్నారు. తన తండ్రి వైఎస్సార్ నుంచి తాను నేర్చుకున్నది ఆ తరహా రాజకీయమే అని కూడా నొక్కి చెప్పారు. మనుషులతో ఏర్పరచుకున్న బంధాలు అలాగే కంటిన్యూ అవుతాయని ఆయన అనడమూ జరిగింది.
ఇవన్నీ ఆ మీటింగులో పాలుపంచుకున్న ఎమ్మెల్యేలకు మహదానందం కలిగించాయి. చప్పట్లు కూడా కొట్టారు. అయితే జగన్ అన్న కొన్ని మాటలను బట్టి చూస్తే వాటిని జాగ్రత్తగా విశ్లేషించుకుంటే మాత్రం చాలా పరమార్ధాలు అందులోనే ఉన్నాయని అంటున్నారు. అదేంటి అంటే నేను ఏ కారణం చేత అయినా ఎవరికైనా టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ సీటు ఇస్తాను, కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తాను ఇక 2029లో అయితే అసెంబ్లీ సీట్లు మరింతగా పెరుగుతాయి అందువల్ల అందరినీ అకామిడేట్ చేస్తాను అని కూడా హామీ ఇచ్చారు.
మొత్తానికి జగన్ స్పీచ్ అంతా చూస్తే టికెట్లు అందరికీ ఇస్తాను అని మాత్రం ఎక్కడా లేదు అని అంటున్నారు. టికెట్లు రాని వారికి తాను మరో విధంగా న్యాయం చేస్తాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశం మీదనే వాడిగా వేడిగా చర్చ అయితే సాగుతోంది. మరి జగన్ ఇండైరెక్ట్ గా అయినా హింట్ ఇచ్చారా. అలా కనుక చూసుకుంటే పనిచేయని వారి జాబితా హైకమాండ్ దగ్గర ఉందా. ఉంటే ఎంతమందికి టికెట్లు ఉండవు అన్న దాని మీద వైసీపీలో తీవ్రమైన అంతర్మధనం సాగుతూనే ఉంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ డైరెక్ట్ గా టికెట్లు ఇవ్వమని చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా యాభై మంది దాకా టికెట్లు ఇచ్చేది లేదని చెప్పేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇక 2029 ఎన్నికల నాటికి ఏపీ అసెంబ్లీలో సీట్లు 225 దాకా పెరుగుతాయని జగన్ చెప్పారు అంటే మరో యాభై సీట్లు ఎక్కువ వస్తాయి అంటే ప్రస్తుతం యాభై సీట్లలో చాలా మందికి టికెట్లు ఇవ్వడం లేదని చెప్పినట్లే కదా అని అంటున్నారు.
అంటే ఇపటికి మరో అరేళ్ల పాటు వెయిట్ చేస్తే ఇపుడు టికెట్లు ఇవ్వని యాభై మందికి 2029 ఎన్నికల్లో కచ్చితంగా ఇస్తామని జగన్ మాట ఇచ్చారా అనన్ దాని మీద కూడా చర్చ సాగుతోంది. ఈలోగా టికెట్లు దక్కని వారు ఉంటే వారిలో కొంతమందికి కార్పోరేషన్ చైర్మన్లు, లేదా ఇతర కీలకమైన పదవులు ఇస్తామని జగన్ చెప్పేసినట్లే అని అంటున్నారు. దీన్ని బట్టి జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే మాత్రం జగన్ చెప్పకుండానే మ్యాటర్ చెప్పేశారు అని అంటున్నారు.
ఆ విధంగా చూసుకుంటే ఎవరు ఆ యాభై మంది అన్నది మళ్లీ బుర్రకు హీటెక్కించే డిస్కషన్ గా సాగుతోంది. పనితీరు బాగులేని వారికి ఎట్టి పరిస్థితుల్లో జగన్ టికెట్ ఇవ్వరనే అంటున్నారు. దానికి రుజువుగా ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలకు జగన్ ఏ మాత్రం టికెట్ హామీ ఇవ్వలేదు అని అంటున్నారు. మేకపాటి అయితే నాకు ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారని బయటే చెప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అంటే ఈసారి ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం కాబట్టి జగన్ టికెట్లు ఇచ్చే విషయంలో చాలా కఠినంగా ఉంటారనే అంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రతిష్ట కలిగినవి అయినా జగన్ ఎక్కడా తగ్గలేదు అనుకుంటే ఇక మీదట ఆయన గెలుపు గుర్రాలని తాను అనుకున్న వారికే ఇస్తారని అంటున్నారు. టోటల్ గా వైసీపీలో అర్ధం అవుతున్నది ఏంటి అయితే ఎవరో ఒక యాభై మందిదాకా ఎమ్మెల్యేలకు టికెట్లు హుళక్కే అని. మరి ఆ బ్యాడ్ లక్ ఎవరికి అన్నదే ఇపుడు కీలకమైన చర్చ. దీనికి జవాబు తొందరగా అయితే దొరకదు. ఓపిక పట్టాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.