Begin typing your search above and press return to search.
మోడీ సర్కారును కూల్చేందుకు సోనియా కుట్ర చేశారా?
By: Tupaki Desk | 17 July 2022 6:30 AM GMTగుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. బీజేపీకి ఆ రాష్ట్రం ఒక కంచుకోటగా మార్చిన ఘనత కచ్ఛితంగా నరేంద్ర మోడీదేనని చెప్పాలి. మోడీ ఎంట్రీకి ముందు వరకు గుజరాత్ లో ఉన్న రాజకీయ సమీకరణల్ని పూర్తిగా మార్చేసి.. పరిస్థితి మొత్తం తన కనుసన్నల్లో ఉండేలా చేయటంలో ఆయన కీలక భూమిక పోషించినట్లుగా చెప్పక తప్పదు. అలాంటి మోడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ గతంలో ప్లాన్ చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
దీనికి కారణం.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. తాజాగా ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్నాయి.అప్పట్లో గుజరాత్ కు మోడీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వేళలో.. సోనియా గాంధీ కుట్ర పన్నారని.. దీని ప్రకారం ఆమె తన పరపతిని.. డబ్బును పెద్ద ఎత్తున వాడినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించిన సంబిత్ మాటలు ఇప్పుడు రాజకీయ మంటలుగా మారాయి.
ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ''2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అప్రతిష్టపాలు చేయాలని ప్లాన్ చేశారు. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుట్ర చేశారు. పార్టీకి చెందిన దివంగత నేత అహ్మద్ పటేల్ ప్రయోగించి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ కు రూ.30 లక్షలు ఇచ్చారు. మొదట రూ.5లక్షలు.. తర్వాత రూ.25 లక్షలు ఇచ్చారు. తీస్తా సతల్వాడ్ పట్ల ప్రేమతోనే సోనియా ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. తీస్తా సెతల్వాడ్ తో పాటు.. మాజీ ఐపీఎస్ అదికారి సంజీవ్ భట్.. గుజరాత్ మాజీ డీజీపీ ఆర్ బీ శ్రీకుమార్ తో కలిసి సోనియా గాంధీ రాజకీయ సలహాదారుగా ఉన్న అహ్మద్ పటేల్ కీలక భూమిక పోషించారు'' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై కాంగ్రెస్ మండిపడింది. అబద్దాలు.. అసత్యాలు చెప్పారని విరుచుకుపడింది. చనిపోయిన వారిని కూడా వదిలిపెట్టరా? అంటూ ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే.. మోడీ విషయంలో సోనియాగాంధీ ఎలాంటి ఎత్తులు వేశారు? మరెలాంటి పావుల్ని కదిపారన్న దానికి నిదర్శనంగా బీజేపీ నేత మాటలు ఉన్నాయి. అయితే.. ఇందులో నిజానిజాల మాటేమిటి? అన్న విషయంపై ఇప్పటికి వచ్చిన వివరాలు ఇలా ఉంటే.. రానున్న కాలంలో ఇదే అంశం మీద మరిన్ని వివరాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదనే చెప్పాలి.