Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను రష్యా దొంగలించిందా ?
By: Tupaki Desk | 12 Aug 2020 6:00 AM GMTకరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రోజురోజుకి కరోనా వ్యాధి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 2 కోట్ల కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటువంటి తరుణంలోనే రష్యా ఓ శుభవార్త ను చెప్పింది. కరోనా వ్యాక్సిన్ సిద్ధం అంటూ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ను మొదటగా రష్యా అధినేత పుతిన్ కుమార్తెకి ఇచ్చారు. ముందుగా వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్నారులకు ఆ తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ వేస్తారని అధ్యక్షుడు వెల్లడించారు. దీంతో తోలి కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన దేశంగా రష్యా రికార్డ్ సృష్టించింది.
అయితే, వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రష్యా ఈ వ్యాక్సిన్ ను ప్రమాణాల ప్రకార మూడు దశల్లో ట్రయల్స్ సరిగా నిర్వహించలేదని, ఎదో చేశాం అంటే చేశాం అన్నట్టుగా ట్రయల్స్ నిర్వహించి , చాలా హడావిడిగా వ్యాక్సిన్ ను తీసుకొచ్చారని చెప్తుంది. ఈ వ్యాక్సిన్ మొదటి దశలో జూన్ 17న 76 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చింది. రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే మూడో దశను ముగించి , టీకా రిలీజ్ చేసింది. సాధరణంగా ఇది అసాధ్యం. రెండు నెలల్లో మూడు దశల ట్రయల్స్ పూర్తి కావు.
ఇకపోతే, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే వంద రకాల వ్యాక్సిన్లు ట్రయల్ దశలో ఉన్నాయి. వాటిలో ఆరు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద నమోదు చేయించుకున్నాయి. అవి ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ లో ఉన్నాయి . వాటి ఫలితాలను బట్టి అవి సక్సెస్ అయ్యాయా లేదా అని తెలిస్తే , ఆ తర్వాత వ్యాక్సిన్ కు తుది అనుమతులు లభిస్తాయి.ఇక రష్యా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కు స్పుత్నిక్ వీ అనే పేరు పెట్టింది. ఈ వ్యాక్సిన్ ను బాడీకి ఇవ్వగానే కరోనా వైరస్ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన ముళ్లను నాశనం చేస్తుందని తెలిపింది. ఆ కొవ్వు, ముళ్లూ పోతే, కరోనా బతకదు. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా ఇలాగే పనిచేస్తుందని, రష్యా తమ ఫార్ములాను హైజాక్ చేసిందని చైనాలో కాన్సినో బయోలాజిక్స్ ఆరోపణలు చేయడంతో అందరిలో ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ పై అనుమానాలు మొదలైయ్యాయి. అలాగే కేవలం చైనా మాత్రమే కాదు .. అమెరికా, యూకే, కెనడా కూడా రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్ద నుంచి వ్యాక్సిన్ ఫార్ములాను హ్యాక్ చేసిందని ఆరోపణలు చేస్తున్నాయి.