Begin typing your search above and press return to search.

ఆ అధ్యక్షుల డీఎన్ఏ లను రష్యా సేకరించిందా..?

By:  Tupaki Desk   |   20 Feb 2022 2:30 PM GMT
ఆ అధ్యక్షుల డీఎన్ఏ లను రష్యా సేకరించిందా..?
X
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక బల ప్రదర్శన మరింత విస్తృతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు అయిన జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే యుద్ధాన్ని విరమించుకోవాలని వివిధ దేశాధినేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరుతున్నారు.

ఇందుకు సంబంధించి చర్చల ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ అధ్యక్షులు ఇటీవల పుతిన్ తో భేటీ అయ్యారు. అయితే వారు అధ్యక్షుడిని భేటీ అయ్యే ముందు కొవిడ్ పరీక్ష చేయించుకునేందుకు నిరాకరించారు. వారు కరోనా పరీక్ష చేయించుకునే దానికి ఎందుకు విముఖత వ్యక్తం చేశారు అనే దానిపై సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీని వెనుక ఉండే కారణాలు ఏంటి దానిపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అసలు ఏం జరిగింది అంటే గత నెలలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రోన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ లు రష్యా అధినేత అయిన పుతిన్ ను కలిసేందుకు మాస్కోకు వెళ్లారు. పుతిన్‌తో భేటీ కావడానికి ఎవరైనా ఆ దేశానికి వచ్చిన వారు కచ్చితంగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ అధ్యక్షులు మాత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకునేందుకు సాంపిల్స్ ఇవ్వలేదు.

దీనికి ప్రధాన కారణం నాసిల్‌ స్వాబ్‌ సాయంతో తమ డీఎన్‌ఏ సమాచారాన్ని సేకరిస్తారు అనే అభిప్రాయం ప్రపంచ నేతల్లో బలంగా వినిపిస్తుంది. ఈ కారణంగానే ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. అమెరికాలో కూడా అధ్యక్షుడిని కలవాలంటే కచ్చితంగా వారు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొంత వెసులుబాటు ఉంది. అది ఏంటి అంటే తమ దేశం నుంచి టెస్ట్ కోసం తెచ్చిన వాటిని ఉపయోగించవచ్చు.

అసలు ఈ డీఎన్ఏ సేకరణ ఏంటీ అంటే... ప్రపంచంలో అందరికీ డీఎన్ఏ అనేది ఉంటుంది. దీనిని సేకరించి పరీక్షించడం ద్వారా కొన్ని కీలక విషయాలను మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి తల్లి దండ్రులు ఎవరు? అతని ఎలాంటి రోగాలు ఉన్నాయి? జన్యుపరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుందా అనే ఇలాంటి చాలా విషయాలను రాబట్టుకోవచ్చు. అయితే ఇలా సేకరించిన ప్రపంచ స్థాయి నేతల డీఎన్ఏ కి చాలా విలువ ఉంటుంది.

ముఖ్యంగా ఆ డీఎన్ఏ ను ప్రతిపక్షం వారికి అందితే చాలా కష్టం. ఎందుకంటే అత్యంత గోప్యమైన సమాచారం ఇందులో ఉంటుంది. ఉదాహరణకు దేశాధ్యక్షుడికి జన్యుపరమైన లోపాలు ఉంది అని ప్రతిపక్షం వారికి తెలిస్తే అది బయటకు చెప్పకుండా ఉండేదుకు అతడ్ని బ్లాక్ మెయిల్ చేయవచ్చు. మానసికంగా చాలా దెబ్బతీయవచ్చు.

ఈ డీఎన్ఏ ని దేని నుంచి సేకరిస్తారు అనేది తెలుసుకుందాం. సాధారణంగా వ్యక్తుల డీఎన్ఏ అనేది మానవుని తల వెంట్రుకల్లో, నాసిల్‌ స్వాబ్ లలో, పట్టుకున్న వస్తువుల్లో ఉంటుంది. దానిని చాలా మంది రహస్యంగా సేకరిస్తారు. అమెరికాలో కూడా ఇలాంటివి గతంలో వెలుగులోకి వచ్చాయి.

అధ్యక్షుడు వాడిన గ్లాసులు, బెడ్‌షీట్లు, వస్తువులను డీఎన్‌ఏ గోప్యత కోసం సేకరించేవారని ఓ వ్యక్తి తన రచనల్లో రాసుకువచ్చారు. ఇలా సేకరించిన కొన్ని డీఎన్ఎలను వేలం కూడా వేస్తారు. ఎక్కువ రేటు ఎవరు పెట్టి కొంటే వారికి ఆ డీఎన్ఏ స్యాంపిల్ను ఇస్తారు. పై కారణాల వల్లే ఆ దేశాల అధ్యక్షులు కొవిడ్ టెస్టుకు నో చెప్పి ఉంటారని నిపుణులు అంటున్నారు.