Begin typing your search above and press return to search.

వ‌కీల్ సాబ్ స్వ‌యంగా ఛాన్స్ ఇచ్చేశారా...?

By:  Tupaki Desk   |   27 Sep 2021 4:47 PM GMT
వ‌కీల్ సాబ్ స్వ‌యంగా ఛాన్స్ ఇచ్చేశారా...?
X
టార్గెట్ ప‌వ‌న్‌! అధికార పార్టీ వైసీపీలో ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న చ‌ర్చ ఇది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. 2014-19 టీడీపీ పాల‌న‌లోనూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను, వైసీపీ నేత‌ల‌ను ఫుల్లుగా టార్గెట్ చేసిన ప‌వ‌న్‌పై వైసీపీలో పిచ్చ క‌సి ఉంది. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఏ కార‌ణ‌మో తెలియ‌దుకానీ.. వైసీపీ నేత‌లు సంయ‌మ‌నం పాటిస్తున్నారు. కానీ, తాజాగా మాత్రం నేత‌లు ఒక్కొక్క‌రుగా స‌ద‌రు క‌సి తీర్చేసుకున్నారు. మంత్రులు అనిల్‌కుమార్ యాద‌వ్‌, పేర్ని నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ త‌దిత‌రులు.. వ‌రుస పెట్టి వాయించి వ‌దిలేశారు. ప‌వ‌న్‌ను భారీ రేంజ్‌లో తిట్టిపోశారు. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. అంటూ.. ఆయ‌న డైలాగులు ఆయ‌న‌కే అప్ప‌గించారు.

అయితే.. ఇది కేవ‌లం మంత్రులు మాత్ర‌మే చేసిన వ్యాఖ్య‌లు అనుకుంటే.. పొర‌పాటే అంటున్నారు ప‌రిశీల‌కులు. చాలా వ్యూహాత్మ కంగా.. ప‌వ‌న్ ఇచ్చిన అవ‌కాశాన్ని వైసీపీ వినియోగించుకుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ప‌వ‌న్ ఇప్పుడు కొంత జోష్‌లో ఉన్నారు. ఎలా అంటే. గ‌త సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కేవ‌లం ఒకే ఒక అసెంబ్లీ సీటును ద‌క్కించుకుంది. అయితే.. స‌ద‌రు ఎమ్మెల్యే కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో కొంత పార్టీలో నైరాశ్యం ఏర్ప‌డి.. సీనియ‌ర్లు, కొత‌వారు సైతం ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

ఈ క్ర‌మంలో అటు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. ఇటు స్థానికం, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ పార్టీ కొంత మేర‌కు పుంజుకుంది. అంటే.. కొంత శ్ర‌మ ప‌డితే.. పార్టీ మ‌రింత పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌యంలో స‌హ‌జంగానే అధికార పార్టీ వైసీపీకి.. ప్ర‌తిప‌క్షాల సంఖ్య పెర‌గ‌డంతోపాటు.. పోటీ కూడా పెరుగుతున్న‌ట్టు క‌నిపి స్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ను టార్గెట్ చేయాల‌నేది వైసీపీ ప్లాన్‌. అయితే.. అవ‌కాశం కోసం .. వారు ఎదురు చూస్తున్నారు.కానీ, ఇంత‌లోనే ప‌వ‌న్ చేజేతులా అవ‌కాశం ఇచ్చేశారు. అది కూడా ఓ సినీ ఫంక్ష‌న్‌లో మంత్రుల‌ను టార్గెట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా వైసీపీ దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది.

ప‌వ‌న్‌ను ఏకేసింది. క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ ఇమేజ్ డ్యామేజీ అయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఎలా గంటే.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఏ ఒక్క‌రూ మాట్లాడ‌లేదు. ఒక‌వేళ మాట్లాడినా.. వారు చోటా న‌టులు.. పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లలేదు. పైగా మంత్రులు గుండుగుత్తుగా.. ఒక్క‌సారిగా విరుచుకుప‌డేస‌రికి.. ప‌వ‌న్.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. అవి జోరుగా వైర‌ల్ అవ‌డం వంటివి కూడా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. త‌ను ఎప్పుడూ. విలువ‌లు విజ్ఞ‌త అంటూ.. వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఇప్పుడు మంత్రుల‌ను స‌న్నాసుల‌తో పోల్చ‌డం వంటివి మేధావి వ‌ర్గాన్ని కూడా విస్మ‌యానికి గురిచేశారు.

ఈ క్ర‌మంలో అటు మంత్రులు ఎన్ని తిట్టిపోసినా.. ఇటు జ‌న‌సేన నుంచి కానీ. అటు ఇండ‌స్ట్రీ నుంచి కానీ.. లేదా మేధావి వ‌ర్గం నుంచి ఒక్క‌రంటే ఒక్క‌రూ స్పందించ‌క‌పోవ‌డం.. వైసీపీ టార్గెట్ స‌ఫ‌ల‌మ‌య్యేలా చేసింది. మొత్తానికి ప‌వ‌న్ తనంత‌ట తానే టార్గెట్ అయ్యారనే వాద‌న మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.