Begin typing your search above and press return to search.

అకిరాతో త‌న‌కు సంబంధం లేద‌ని ప‌వ‌న్ అన్నారా?

By:  Tupaki Desk   |   17 July 2022 9:30 AM GMT
అకిరాతో త‌న‌కు సంబంధం లేద‌ని ప‌వ‌న్ అన్నారా?
X
ఏపీ ప్ర‌భుత్వంపై, వైఎస్సార్సీపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైఎస్సార్సీపీ మ‌రోమారు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగింది. రేణు దేశాయ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కుమారుడు అకీరా నంద‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అకీరా నంద‌న్ తో త‌న‌కు సంబంధం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నార‌ని వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి య‌న‌మ‌ల నాగార్జున యాద‌వ్ తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేశారు.

ఈ మేర‌కు కోర్టుకు స‌మ‌ర్పించిన పిటిష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్.. అకీరానంద‌న్ తో త‌న‌కు సంబంధం లేద‌న్నార‌ని.. వ్య‌క్తిత్వం, విలువ‌లు లేని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని నాగార్జున యాదవ్ యువ‌త‌కు సూచించారు.

2007లో సెప్టెంబర్ 5న‌ ఓపీ 590/2007 పిటిషన్ నంబర్‌లో రేణు దేశాయ్ తో లివింగ్-ఇన్ రిలేషన్‌షిప్ ద్వారా మీకు కొడుకు పుట్టారా అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్రశ్నించగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్ కల్యాణ్ కోర్టుకు తెలిపార‌ని నాగార్జున యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కోర్టుకు ఇచ్చిన స‌మాధానంలో రేణు దేశాయ్ తో కానీ, అకీరా నంద‌న్ తో కానీ త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆ పిటిష‌న్ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోర్టుకు తెలిపార‌ని నాగార్జున యాద‌వ్ తెలిపారు. కాబ‌ట్టి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అనుస‌రించే ప్ర‌తి ఒక్కరూ ఆయ‌న ఎలాంటివాడో తెలుసుకోవాల‌ని కోరారు.

రేణు దేశాయ్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సంబంధం లేక‌పోతే 2004లో అకీరా నంద‌న్ ఎలా జ‌న్మించాడ‌ని నాగార్జున యాద‌వ్ నిల‌దీశారు. ఇప్పుడు నాగార్జున యాద‌వ్ ఇచ్చిన ఈ ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది.