Begin typing your search above and press return to search.

పవన్ మాట మార్చారా..?

By:  Tupaki Desk   |   13 May 2023 8:00 AM GMT
పవన్ మాట మార్చారా..?
X
మీడియా మీటింగులో చెప్పి ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే పార్టీ నాయకులతో మాట్లాడుతూ పవన్ వేరే విధంగా అర్ధం వచ్చేలా వివరణ ఇచ్చారా. ఇదే ఇపుడు చర్చనీయాశం అవుతోంది. పవన్ మీడియాతో మాట్లాడినపుడు ముఖ్యమంత్రి పదవిని తాను ఎవరినీ కోరమని, అది వరించి రావాలని అన్నారు. అయితే మంగళగిరి ఆఫీసులో జన సైనికులతో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి పదవి అన్నది ఎన్నికల తరువాత నిర్ణయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

మరి ఈ ఇరవై నాలుగు గంటలలో మారినది ఏమిటి. పవన్ తన మనసులో మాటను మీడియా ముందు అలా పార్టీ నాయకుల ముందు ఇలా చెప్పారా అనే అంతా చర్చించుకుంటున్నారు. జనసైనికులు అయితే పవన్ని సీఎం గానే చూస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ సీఎం అనే వారు అంటున్నారు.

ఎంతలా అంటే పవన్ కే చికాకు వచ్చేంటంతలా . అది వారి అభిమానం. వారు పవన్ సీఎం అని ఫిక్స్ అయిపోయారు. అలాంటిది పవన్ సీఎం పదవి అన్నది తనకు ముఖ్యం కాదు అన్నట్లుగా మీడియాతో మాట్లాడినపుడు వారంతా షాక్ అయ్యారని అంటున్నారు. దాంతో పవన్ పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు.

సీఎం పదవి వద్దు అంటే ఇపుడు ఆ ప్రస్తావన వద్దు అన్నదే తన ఉద్దేశ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ముందు రాజకీయ శత్రువుని ఓడించాలి. వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించాలి ఇదే అందరి లక్ష్యం కావాలి అని అన్నారు. సీఎం ఎవరు కావాలి అన్నది ఎన్నికలు అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక ఎవరి బలాబలాలు చూసుకుని అపుడు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు.

అయితే ఇక్కడే మరిన్ని కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయి. కూటమి నుంచి సీఎం అభ్యర్ధి అంటూ ఎవరూ లేకుండా ఎన్నికలకు వెళ్తారా. అది సాధ్యమేనా అన్నదే ప్రశ్నగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబుని సీఎం అభ్యర్ధిగా తెలుగుదేశం ఎప్పటి నుంచో ప్రొజెక్ట్ చేస్తోంది. ఆయన కూడా సీఎం గానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతాను అని అన్నారు.

అంటే కూటమి కట్టినా దానికి బాబే సహజంగా సీఎం క్యాండిడేట్ అవుతారు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎన్నికల తరువాత సీఎం అని పవన్ అంటున్నారు. ఆ మాట చంద్రబాబు నోటి వెంట వస్తే అంతా నమ్ముతారని అంటున్నారు. పవన్ కి సీఎం చాన్స్ ఉందని కూడా విశ్వసిస్తారు.

ఇక మరో విషయం పవన్ చెప్పారు. బలాబలాలు చూసుకుంటామని. సహజంగానే కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీయే ఉంటుంది. ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది. బలం చూసినా ఆ పార్టీకే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎన్నికలు అయిపోయాక బలాబలాలు ప్రత్యేకంగా తేలాల్సి ఏమి ఉంటుంది అన్నదే కీలకమైన ప్రశ్న.

గౌరవ ప్రదమైన సీట్లు అని పవన్ అంటున్నారు అంటే ఆయన ఒక యాభై సీట్లు కోరినా టీడీపీ 125 దాకా సీట్లు పోటీ చేస్తుంది. అపుడు పెద్ద పార్టీకే సీఎం పదవి ఇవ్వడం సహజం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ సీఎం పదవి గురించి ఇపుడు చర్చ వద్దు అని పవన్ అంటున్నారు. అంతే కాదు తాను సీఎం కావాలీ అంటే 50 శాతం ఓట్ల షేర్ వచ్చేలా చూడాలని అంటున్నారు. పొత్తులో పోటీ చేస్తే అంత ఓట్ల షేర్ ఎలా వస్తుంది. ఒక వేళ వచ్చినా అందులో టీడీపీ వాటా కూడా ఉంటే జనసేన సొంతం అని ఎలా క్లెయిం చేస్తారు ఇవన్నీ ప్రశ్నలే.

మరో వైపు జనసేనకే యాభై సీట్లకు పోటీ చేస్తేనే అంత ఓట్ల షేర్ వస్తే 125 సీట్లు పోటీ చేసిన టీడీపీకి ఎంత ఓట్ల షేర్ రావాలి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన ప్రశ్నలే. మొత్తానికి పవన్ అయితే సీఎం సీటు ఎన్నికల తరువాత అంటూ ఇంకా చాన్స్ ఉంది అంటున్నారు. మరి వ్యూహాలు అన్నీ నావి అంటున్న ఆయన వ్యూహం ఏంటో వేచి చూడాల్సిందే.