Begin typing your search above and press return to search.
దేశంలో సరికొత్త లీడర్ 'నోటా'..దాని ముందు అభ్యర్థులు దిగదుడుపే!
By: Tupaki Desk | 13 Nov 2020 3:40 PM ISTనోటా (నన్ ఆఫ్ ది అబవ్) ప్రజలకు ప్రభుత్వం కల్పించిన ఒక చక్కటి అవకాశం. ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థి లేకపోయినా. ఇదివరకు ఎవరు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సి వచ్చేది. అయితే ఈవీఎంలపై నోటా గుర్తు వచ్చాకా.. తమకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి నచ్చలేదని పౌరులు నిర్భయంగా తమ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో నోటాను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో పోటీచేసిన అభ్యర్థుల కన్నా నోటాకు ఓట్లు అధికంగా వస్తే.. ఆ నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు.
కాగా కొన్నేళ్లుగా, సాధారణ ఎన్నికలతో పాటు, ఉప ఎన్నికలలో నోటాకు ఓట్లు పడే శాతం అధికమవుతోంది. శాసనసభే కాదు.. పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా నోటా ఓట్లు అధిక సంఖ్యలో పడుతున్నాయి. తాజాగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా పలువురు అభ్యర్థుల కంటే నోటా కు అధికంగా ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లను పరిశీలిస్తే నోటాకు 552 మంది ఓటేశారు. పోటీ చేసిన 11 మంది కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పడగా, 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీహార్ తో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ నోటా కు వచ్చిన ఓట్ల శాతం అధికంగానే ఉంది.
బీహార్ ఎన్నికల్లో నోటాకు 7.06 లక్షల ఓట్లు పడ్డాయి. పోలైన మొత్తం మాటల్లో ఇది 1.7శాతంగా ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. లండన్ నుంచి తిరిగి వచ్చి ఫ్లూరల్స్ అనే పార్టీని స్థాపించిన జేడీయూ సీనియర్ నేత వినోద్ కుమార్తె పుష్పమ్ ప్రియా చౌధురి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఓ చోట అయితే ఆమెకు 1521 ఓట్లు రాగా నోటాకు 2929ఓట్లు పడ్డాయి. మరోచోట కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఏపీలో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సాలూరు నియోజవర్గంలో నోటాకు 4, 874 ఓట్లు వచ్చాయి. నోటా ఓట్ల పరంగా మూడో స్థానంలో నిలవగా కాంగ్రెస్, జనసేన అభ్యర్థులకు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి.
నోటాకు ప్రాధాన్యం పెరిగింది ఇందుకే
ఒకప్పటి రాజకీయాలు విలువలతో కూడి ఉండేవి. ప్రజా సేవ చేయాలనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లే వారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే వారు కాదు. ఓటుకు నోటు ఉండేది కాదు. రాజకీయ నాయకులు గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. పార్టీలు కూడా కొత్త అభ్యర్థులుగా ప్రజల్లో పేరు పొందిన వారిని, సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి, విశ్రాంత ఐఏఎస్ లు, డాక్టర్లకు టిక్కెట్లు ఇచ్చేవి. అయితే రాజకీయాల్లో రానురాను మార్పులు వచ్చాయి. ఇప్పటి రాజకీయ వ్యవహారమే వేరు.
అధికారాన్ని తేల్చేది మందు, నోటే
ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, నీతి, నిజాయితీ ఉన్న వాళ్లా కాదా అన్నది చూడడం లేదు. పార్టీకి ఎంత వరకు ఫండ్ ఇవ్వగలరు. ఎన్నికల ఖర్చు ఎంత వరకు పెట్టుకోగలరు.ప్రజలకు ఎంత పంచగలరు అనేది మాత్రమే చూస్తున్నారు. అందుకే రాజకీయ నాయకుల్లో నీతి, విలువలు ఉండేవాళ్ళు కనిపించడం లేదు. అంతా ఎర్రచందనం స్మగ్లర్లు, రౌడీలు, ఇసుక మాఫియా లీడర్లు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ సంపదను మరింత పెంచుకోవడానికి, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు.
ప్రజా సమస్యలు నిలదీసే నేతలేరీ?
ఒకప్పుడు ప్రజా సమస్యలపై రాజకీయ నాయకులు మాట్లాడితే అసెంబ్లీ, పార్లమెంట్ లు దద్దరిల్లేవి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొత్త నాయకులు చాలామంది అవినీతి మారాజులు కావడంతో వారికి ప్రజా సమస్యల పైన అంతా అవగాహన లేదు. మాట్లాడే నైపుణ్యం అంతకన్నా లేదు. అందుకే రాజకీయ నాయకుల గొంతుక రోజురోజుకుఅందుకే రాజకీయ నాయకుల గొంతుక రోజురోజుకూ మూగబోతోంది
అందుకే నోటాకు ఓట్లేసిది
ఇలాంటి రాజకీయ నాయకులను చూడలేకే ప్రజలు చాలా మంది తమకు అభ్యర్థి నచ్చడం లేదంటూ నోటాకు ఓట్లు గుద్దుతున్నారు. ఇలా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై స్పందించే వారు, అస్సలు అవగాహన లేని వారంతా నాయకులు అంటే ప్రజలేలా అంగీకరిస్తారు. అందువల్లే నోటాకు ఓట్లు వేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.