Begin typing your search above and press return to search.

మోడీని పిలిచి మ‌రీ అవ‌మానించారు

By:  Tupaki Desk   |   23 Dec 2015 6:05 AM GMT
మోడీని పిలిచి మ‌రీ అవ‌మానించారు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి టైం బాగా లేన‌ట్లుంది. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు నిష్ప‌లంగా ముగిసే ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌టం, బీజేపీలో నంబ‌ర్‌2గా ఉన్న అరుణ్‌ జైట్లీ ఆర్థిక కుంభ‌కోణం చిక్కుల్లో ప‌డ‌టం ఇప్ప‌టికే మోడీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేదు. ఈ త‌ర‌హా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు చాల‌వ‌న్న‌ట్లు మ‌రో యూనివ‌ర్సిటీ మోడీని అవ‌మానించినంత ప‌నిచేసింది.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రావాల‌ని ప్రధాని నరేంద్రమోడీని ఆ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జమీరుద్దిన్ షా కొద్దికాలం క్రితం క‌లిసి ఆహ్వానించారు. అయితే దీనిపై ప‌లువురు పూర్వ విద్యార్థులు అభ్యంత‌రం తెలిపారు. అయినప్ప‌టికీ షా మాత్రం ప్ర‌ధాన‌మంత్రిని పిలిస్తే త‌ప్పేమిట‌ని చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు హ‌ఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. యూనివర్సిటీలోని వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు పెంచాలని కోరేందుకు మాత్ర‌మే ప్రధానితో భేటీ అయ్యారట‌. మీడియాలో త‌ప్పుడు కథనాలు వ‌చ్చాయ‌ని వివరణ ఇస్తూ...స్నాతకోత్సవానికి రావాల్సిందిగా ప్ర‌ధానిని ఆహ్వానించలేద‌ని చెప్పారు.

అలీగ‌డ్ ముస్లిం యూనివ‌ర్సిటీ, వీసీ షా వార్త‌ల్లో ఇదే తొలిసారి కాదు. గ‌తంలో అమ్మాయిల‌కు లైబ్ర‌రీలో అమ్మాయిల‌కు ప్ర‌వేశంలేద‌ని వైస్ చాన్స్‌లర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. "అమ్మాయిలొస్తే.. అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం కుదరదు" అంటూ షా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. షా ఆర్డ‌ర్‌ ను మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న కేంద్రప్రభుత్వం వీసీ జమీరుద్దీన్ షా నుంచి వివరణ కోరింది. దీనిపై ప‌లువురు విద్యార్థులు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో అల‌హాబాద్ హైకోర్టు అమ్మాయిలు-అబ్బాయిలు అనే తేడా చూపుతూ ప్రధాన గ్రంథాలయంలోకి విద్యార్థినులను అనుమతించడం స‌రికాద‌ని షాకు మొట్టికాయ‌లు వేసింది.