Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు కన్నడిగుల కలల్ని ఏం చేసినట్లు మోడీ సార్?

By:  Tupaki Desk   |   9 May 2023 1:58 PM GMT
ఇన్నాళ్లు కన్నడిగుల కలల్ని ఏం చేసినట్లు మోడీ సార్?
X
ప్రధాని నరేంద్ర మోడీ లో ఇద్దరు మోడీ లో ఉన్నారని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు చెబుతుంటారు. అందులో ఒకరు ఎన్నికలకు ముందు.. మరొకరు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించే ధోరణి ఆయనలో కనిపిస్తుంటుంది. ఓటర్ల ఆశలు.. ఆకాంక్షల గురించి ఆయన విడిరోజుల్లో అస్సలు మాట్లాడరు. కానీ.. ఎన్నికలు వచ్చేస్తే మాత్రం ఒక్కసారిగా ఆయనకు సదరు రాష్ట్రం మీదా.. రాష్ట్ర ప్రజల మీద ప్రేమాభిమానులు పొంగి పొర్లుతుంటాయి. తాజాగా అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించారు నరేంద్ర మోడీ.

మరో రోజులో (బుధవారం)కర్ణాటక అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల కు సంబంధించిన కీలక పోలింగ్ రేపు ఉదయం నుంచి షురూ కానుంది. ఇలాంటి వేళ, ఆయనకు కన్నడిగు లు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు. బీజేపీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో డెవలప్ మెంట్ అన్నది లేకుండా పోయిందని.

ఐటీ హబ్ గా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న బెంగళూరు మహా నగర ప్రాభవం మసకబారిపోయిన దుస్థితి. ఇలాంటి వేళ.. బీజేపీ మీద కన్నడిగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని.. కాంగ్రెస్ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో ఘన విజయం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇలాంటి వేళ.. ప్రధాని మోడీ నుంచి కన్నడిగుల కు ఒక లేఖ అందింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. మీ కల తన కలగా ఆయన అభివర్ణించారు. కన్నడిగులు తనపై ఎంతో ప్రేమను కురిపించారని.. ఈ దేశాన్ని అభివ్రద్ది చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని.. భారత దేశం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటమన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే కర్ణాటక వేగంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని.. కరోనా వేళలోనూ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ప్రతి ఏటా రూ.90వేల కోట్ల విదేశీ పెట్టుబడులను పొందిందన్న విషయాన్ని ప్రస్తావించారు. గతప్రభుత్వ హయాంలో మొత్తం రూ.30వేల కోట్లుగా ఉంటే.. తాము పెట్టుబడుల విషయంలో కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

'ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి కల.. ఇకనుంచి నా కలగా మారుతుంది. ప్రతి ఒక్కరూ రేపు మీ ఓటుహక్కు ను వినియోగించుకోవాలి’ అని కోరారు. అధికారంలో ఉన్నన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా కన్నడిగుల కల గురించి మాట్లాడని ప్రధాని.. పోలింగ్ ముందు రోజు హటాత్తుగా గుర్తుకు రావటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది.