Begin typing your search above and press return to search.

మోడీ పాల‌న‌.. పేద‌రికంలో పెరిగామా.. త‌రిగామా? తాజా నివేదిక ఇదే!

By:  Tupaki Desk   |   25 May 2023 8:00 AM GMT
మోడీ పాల‌న‌.. పేద‌రికంలో పెరిగామా.. త‌రిగామా?  తాజా నివేదిక ఇదే!
X
దేశంలో పేద‌రికాన్ని రూపుమాపుతామని.. పేద‌ల‌ను ధ‌న‌వంతుల‌ను చేస్తామ‌ని.. హామీలు గుప్పిస్తూ... 2014లో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశంలో 9 ఏళ్లుగా పాలిస్తున్నారు.

మ‌రి ఆయ‌న ప్ర‌వ‌చించిన పేద‌రికం లెక్క ఎలా ఉంది? ఇప్పుడు ఏమేర‌కు ఉంది? అనే చ‌ర్చ తాజాగా ప్ర‌పంచ వేదిక‌పైకి వ‌చ్చింది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లయిడ్ ఎకనమిక్స్ విభాగం ప్రొఫెసర్‌ స్టీవ్ హాంకే.. 157 దేశాల్లో ఉన్న పేద‌రికంపై తాజాగా అధ్య‌య‌నం చేశారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను తాజాగా ఆయ‌న విడుద‌ల చేశారు.

దీనిని బ‌ట్టి భార‌త్ లో పేద‌రికం 2014కు ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్క‌డే ఉంది. అప్ప‌ట్లో 157 దేశాల్లో 103వ స్థానంలో భార‌త్ నిలిచింది. ఇక‌, తాజాగా వెలువ‌రించిన లెక్క‌ల్లోనూ భార‌త్ ర్యాంకు 103గానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రి దీనిని బ‌ట్టి మోడీ పాల‌నలో పేద‌రికంగా త‌గ్గ‌లేదు అనే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే నిలిచింది. ఈ లిస్టులో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీలంక, హైతీ, అంగోలా, టోంగా, ఘనా దేశాలు మొదటి 15 స్థానాల్లో ఉన్నాయి.

యుద్ధంతో అతలాకుతలమవుతోన్న ఉక్రెయిన్.. అంతర్యుద్దంతో అట్టుడుకుతోన్న సిరియా, సూడాన్‌లను మించి జింబాబ్వే దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. జింబాబ్వేలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోందని, ఇది గత సంవత్సరం 243.8 శాతానికి చేరుకుంది. అక్కడ నిరుద్యోగం చాలా పెరిగింది. లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. ర

ఇక ఈ లిస్టులో భారత్ పేద‌రికంలో 103 ర్యాంకులో ఉంది. నిరుద్యోగ సమస్య ఇండియాలో ఎక్కువ ఉంది. ఇక అమెరికా ర్యాంక్ 134. ఫిన్లాండ్ ర్యాంక్ 109 ర్యాంకులలో ఉన్నాయి. ఇక ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో స్విట్జర్లాండ్, కువైట్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, తైవాన్, నైజర్, థాయిలాండ్, టోగో, మాల్టా ఉన్నాయని నివేదిక తెలిపింది. అన్నింటికంటే స్విట్జర్లాండ్ లో దయనీయ స్కోరు తక్కువగా ఉంది.