Begin typing your search above and press return to search.
మోడీ కీలక ప్రకటన సరైన సమయంలో చేశారా? ఆలస్యమైందా?
By: Tupaki Desk | 26 Dec 2021 5:17 AM GMTజాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడతారన్న సమాచారంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం.. టీవీ స్క్రీన్ల మీదకు వచ్చిన ఆయన.. తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేసి వెళ్లిపోయారు. కీలక ప్రకటన అంటూ రెండు అంశాల్ని ఆయన ప్రస్తావించారు. అందులో ఒకటి పిల్లలకు (15-18) వయసు పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయటం. పెద్ద వయస్కులు.. వైద్యులు.. ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు వేయటం. ఈ రెండు ప్రకటనలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ మోడీ చేసిన కీలక ప్రకటనలు సరైన టైంలో చేశారా? ఆలస్యం చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
సాపేక్షంగా చూస్తే.. రెండు ప్రకటనల్లో ఒకటి ఆలస్యంగా.. మరొకటి టైమ్లీగా చేశారని చెప్పాలి. దాదాపు 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కొవిడ్ టీకా కార్యక్రమం భారీగా జరిగిందనే చెప్పాలి. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. టీకా కార్యక్రమంలో మోడీ సర్కారు ఫస్ట్ క్లాస్ మార్కుల్ని సాధించిందనే చెప్పాలి. ఒక దశ వరకు బాగానే జరిగినా.. గడిచిన రెండు.. మూడు నెలలుగా టీకా కార్యక్రమం మందగించింది. చివరకు కొవిషీల్డ్ తయారీదారు.. తమ టీకాల ఉత్పత్తిని తగ్గించుకుంటామని చెప్పే వరకు వెళ్లింది. ఇలాంటి సమయంలోనే.. జనవరి 2 నుంచి షురూ చేస్తామన్న పిల్లల వ్యాక్సిన్ ను రెండు నెలల ముందు షురూ చేసి ఉంటే.. కరోనా రోగ నిరోధక శక్తి పిల్లలకు ఇప్పటికే వచ్చి ఉండేది. ఈ విషయంలో మోడీ సర్కారు ఆలస్యం చేసిందని చెప్పాలి.
ప్రపంచంలోని పలు యూరోపియన్ దేశాలతో పాటు.. సంపన్న దేశాల్లో 10 నుంచి 18 సంవత్సరాల వయస్కులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టటమేకాదు.. రెండు వ్యాక్సిన్ల కోటాను పూర్తి చేశారు కూడా. దీంతో పోలిస్తే మనం చాలా వెనుకబడి పోయామని చెప్పాలి. ఒమిక్రాన్ వేరియంట్ పై పెరుగుతున్న ఆందోళన వేళ.. పిల్లలకు వ్యాక్సిన్ అది కూడా 15 నుంచి 18 ఏళ్ల వయస్కులకు మాత్రమే అనుమతించటం చూస్తే.. అంతకంటే చిన్న వయస్కులకు టీకా అందుబాటులోకి వచ్చేదెప్పుడు అన్నది ప్రశ్న.
పిల్లలకు వ్యాక్సినేషన్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్న దానిలో మోడీ సర్కారు ఆలస్యం చేసిందని చెప్పాలి. అయితే.. పెద్ద వయస్కులు (రోగాలతో ఇబ్బంది పడే వారు).. వైద్యులు.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలకు జనవరి 10 నుంచి అనుమతి ఇవ్వటం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంగాచెప్పాలి. ఎందుకంటే.. గత జనవరిలో మొదటి డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఒక డోసు ఆర్నెల్ల వరకు రక్షగా నిలుస్తుందని అంచనా వేస్తే.. జనవరి నుంచి బూస్టర్ డోసుకు ఓకే చెప్పటం.. సరైన టైంలో తీసుకున్న చర్యగా చెప్పక తప్పదు.