Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు రావాల్సిన పేరు ప్రఖ్యాతుల్ని మోడీ కొట్టేశారా?

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:10 AM GMT
కేసీఆర్ కు రావాల్సిన పేరు ప్రఖ్యాతుల్ని మోడీ కొట్టేశారా?
X
గులాబీ బాస్ తో సహా.. ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు గడిచిన రెండు రోజులుగా తెగ ఇదైపోతున్నారు. చేతికి బందర్ లడ్డూలాంటి అవకావం వచ్చినప్పటికి తమ సారు దాన్ని వినియోగించుకోవటంలో చేసిన నిర్లక్ష్యాన్ని తరచూ గుర్తు చేసుకుంటూ బాధ పడిపోతున్నారు. అక్కడెక్కడో దేశ రాజధాని ఢిల్లీలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీకి భారత్ బయోటెక్.. అది చేస్తున్న పరిశోధనతో పాటు.. దాన్నిసందర్శించాలన్న ఐడియా ఆయనకు రావటం ఏమిటి? మేధావితనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే తమ సారు కేసీఆర్ కు ఎందుకు రాలేదని తెగ ఫీలైపోతున్నారట.

ఇదే విషయాన్ని గులాబీ అధినాయకుడు తన మాటల్లో పరోక్షంగా చెప్పుకోవటం కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి డజన్ల కొద్ది నేతలు వరదలా హైదరాబాద్ కు వస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. వరద వేళ రానివాళ్లంతా ఎన్నికల వేళలో వస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నా.. వాటిని నగర ప్రజలు సీరియస్ గా పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే.. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ.. దేనికి రాకపోవటం తెలిసిందే. అలాంటి ఆయన.. ప్రధాని మీద ఎందుకు విమర్శలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరికొందరు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. ఆ రోజు ఈ రోజు అన్న తేడా లేకుండా ఏ రోజైనా సరే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా ఉండేది మాత్రం ఎర్రవెల్లినే కదా?.. అదే రాష్ట్రానికి శాపంగా మారిందంటున్నారు. టీఆర్ఎస్ నేతలకు సైతం ఇదే అంశాన్ని లోగుట్టుగా ప్రస్తావిస్తున్నారు. ‘మావోడు రోడ్ల మీదకు తిరగటం మొదలుపెడితే బాగుండేది. ప్రగతిభన్ కే వారానికి ఒకట్రెండుసార్లు మాతమే వచ్చే ఆయన..హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెటి ఉ క్రెడిట్ కొల్లగొట్టేవాళ్లం. మిగిలిన వారికి భిన్నం మాకే మైలేజీ వచ్చి ఉండేది’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచం మొత్తం కన్ను హైదరాబాద్ లో జరుతున్న ప్రయోగం మీదన ఉంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానేం చేయగలనన్న విషయాన్ని చెప్పి ఉంటే.. ఇప్పటికే ఆయన ఖాతాలో కొవిడో పరిశోధనలకు సంబంధించిన మైలేజీ పొందేవాళ్లమని చెబుతున్నారు. తమ అధినేతకు ఫాంహౌస్ పెద్ద శాపంగా మారిందంటున్నారు. ఏమైనా.. భారత్ బయోటక్ శాస్త్రవేత్తల్ని అభినందించటం ద్వారా ప్రధాని మరో మెట్టు ఎదిగితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ మాత్రం ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారని చెప్పక తప్పదు.