Begin typing your search above and press return to search.
మోడీ ఆత్మకు ఆక్స్ ఫర్డ్ ఘనత..
By: Tupaki Desk | 2 Feb 2021 2:34 PM GMTప్రధాని మోడీ గత ఏడాది విశేషంగా ఉపయోగించిన 'ఆత్మ నిర్భర్' అనేది భారతదేశానికి బూస్ట్ లా పనిచేసింది. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్ అనేవి తెలియని భారతదేశం అప్పటివరకు దిగుమతులపై ఆధారపడేది. కానీ మోడీ పిలుపుతో ఇప్పుడు వీటన్నింటిని భారత్ లోనే భారతీయులే తయారు చేసి 'ఆత్మనిర్భర్' భారత్ కలను సాకారం చేస్తున్నారు.
ఈ పిలుపు దేశానికి ఓ బూస్ట్ లా పనిచేసి మన దేశ అవసరాల వస్తువులు మనమే తయారు చేసుకునేలా.. విదేశాల నుంచి దిగుమతికి అడ్డుకట్ట వేసేలా పనిచేసింది.ఈ క్రమంలోనే ప్రధాని మోడీ లాక్ డౌన్ వేళ పిలుపునిచ్చిన 'ఆత్మ నిర్భరత' అనే పదానికి ఆక్స్ ఫర్డ్ కూడా సలాం చేసింది. తమ డిక్షనరీలో దీనికి చోటిస్తున్నట్టు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మారుమోగిన ఈ పదం.. 'హిందీ వర్డ్ ఆఫ్ ఇయర్ 2020'గా నిలిచింది. గత ఏడాది ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన టైంలో మోడీ ఈ పదం వాడగా.. దాన్నే భాషా నిపుణులు పూనమ్, కృతిక అగర్వాల్, ఫాక్సెల్ లతో కూడిన సలహా కమిటీ రిఫర్ చేసింది. గతంలో ఆధార్ (2017), నారీ శక్తి (2018), సంవిధాన్ (2019) ఇలాంటి ఘనత అందుకున్నాయి.