Begin typing your search above and press return to search.

ముక్కంటి దర్శనం వేళ మంత్రి రోజా తప్పు చేశారా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 5:31 AM GMT
ముక్కంటి దర్శనం వేళ మంత్రి రోజా తప్పు చేశారా?
X
గతానికి వర్తమానానికి పరిస్థితుల్లో చాలానే మార్పులు వచ్చాయి. ప్రైవేటుగా జరిగే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. ఆయా అంశాలు బయటకు రాకపోవటమే కారణం. కానీ.. పబ్లిక్ గా జరిగే అంశాలు అందరి నోట నానటమే కాదు.. తప్పులకు తెర తీసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇలాంటి తీరునే ప్రదర్శించి.. కొత్త వివాదానికి తెర తీశారు. దక్షిణ కాశీ క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తిలో అమలు చేసే నిబంధనల్ని పక్కన పెట్టేసి.. మంత్రి రోజా తనకుతోచినట్లుగా పని చేశారన్న ఆరోపణ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

సామాన్య భక్తుల విషయంలో ఒకలా వ్యవహరించే ఆలయ సిబ్బంది.. ప్రముఖులు.. వీవీఐపీలు విషయంలో మాత్రం రోజురోజుకీ చేస్తున్న తప్పుడు పనులు విమర్శలకు తావిచ్చేలా చేసిందని చెప్పాలి. దక్షిణ కాశీగా పేరున్న శ్రీకాళహస్తి స్వామి ఆలయంలో ఉన్న నిబంధనల్ని ఏపీ మంత్రి రోజా పక్కకు పెట్టేయటం హాట్ టాపిక్ గా మారింది. భూతనాథుడి ఆలయంలో ఆలయ అర్చకులు.. వెలిగించే దీపాలు మినహా.. భక్తులు వెంట తెచ్చుకునేందుకు వేటిని అనుమతించరు.

కానీ.. ఏపీ మంత్రి ఆర్కే రోజా మాత్రం నిబంధనల్ని.. ఆచారాల్ని పక్కన పెట్టేసి తాను అనుకున్నదే ఆమె చేశారన్న విమర్శ వినిపిస్తోంది. రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన ఆమె.. ముక్కంటి దర్శనానికి ముందుగా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజ నిర్వహించారు.

దోష నివారణ పూజ తర్వాత స్వామి., అమ్మవార్లకు నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొన్నారు.

ఇంతకూ ఆర్కే రోజా చేసిన తప్పు ఏమంటే.. నేతి దీపాలు.. ఆమె వెంట తెచ్చుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. నిబంధనలకు విరుద్ధంగా నేతి దీపాలు ఆమె తన వెంట తెచ్చుకున్నారు. అంతేకాదు.. నిమ్మకాయ, ప్రతిమలు, టెంకాయ, పిండి మిశ్రమం, గుమ్మడి కాయ వంటి వాటిలో నేతి దీపాలు వెలిగించడం నిషేధం. కానీ.. మంత్రి రోజా మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఆలయానికి వెళ్లటం ఏమో కానీ.. ఇప్పుడు తెర మీదకు వచ్చిన అంశం కావాలని చేసింది కాదన్న మాట వినిపిస్తోంది.