Begin typing your search above and press return to search.

జూనియర్ తో అమిత్ షా భేటీ : కొడాలి కరెక్ట్ గా చెప్పారా...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 10:30 AM GMT
జూనియర్ తో  అమిత్ షా భేటీ  :  కొడాలి కరెక్ట్ గా చెప్పారా...?
X
జూనియర్ ఎన్టీయార్ నందమూరి బ్లడ్. మూడవ తరంలో ఇరగదీస్తునన్ సూపర్ స్టార్. జూనియర్ ఎన్టీయార్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడు అని కేంద్ర మంత్రి అమిత్ షా కొనియాడారు. అయితే ఆ సంగతి ప్రేక్షకులకు ఎపుడో తెలుసు. ఇదిలా ఉంటే అమిత్ షా అర్జంట్ గా జూనియర్ తో ఎందుకు భేటీవేశారు అంటే దానికి ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అయితే జూనియర్ కి అత్యంత సన్నిహితుడుగా ఒకనాడు పేరుపడిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని అయితే తనదైన విశ్లేషణ చేశారు.

జూనియర్ ఈ రోజు సామాన్యుడు కాడు, ఆయన ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. దాని కంటే ముందు జూనియర్ ముప్పయి దాకా సినిమాలు చేసారు. అవన్నీ హిందీలో డబ్ అయి ఈసరికే ఉత్తరాది వారికి జూనియర్ చిరపరిచితుడు అయ్యారని చెప్పుకొచ్చారు. జూనియర్ ని పిలిచి దాదాపు నలభై అయిదు నిముషాలకు పైగా అమిత్ షా మాట్లాడారు అంటే ఊరకే కాదు అని కొడాలి నాని కొత్త విషయమే చెప్పారు.

సాధారణంగా అమిత్ షా కానీ మోడీ కానీ బీజేపీకి ఉపయోగపడే ఏ పనీ చేయరని కొడాలి అన్నారు. పైగా ఫుల్ బిజీ షెడ్యూల్ పెట్టుకుని హైదరాబాద్ వచ్చిన అమిత్ షా అందులో ముప్పావు గంట జూనియర్ ఎన్టీయార్ కి ఇచ్చారూ అంటే ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది అన్నారు. చంద్రబాబు ఆ మధ్య ఢిల్లీలో కొన్ని రోజులు ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా జూనియర్ తో డిన్నర్ చేశారు అంటే పెద్ద ప్లాన్ ఉందని కొడాలి నాని కనిపెట్టి చెబుతున్నారు.

జూనియర్ కి ఉన్న పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ని సొమ్ము చేసుకోవడానికి బీజేపీ చూస్తోందని ఆయన అన్నారు. దేశమంతా బీజేపీని విస్తరించడానికి ఆ పార్టీ చూస్తోందని, అందులో భాగంగానే జూనియర్ ని బీజేపీ తరఫున ప్రచారానికి వాడుకుంటారని కొడాలి నాని అంటున్నారు.

మరి జూనియర్ తో ఏకంగా ఇరవై నిముషాల దాకా ఏకాంత చర్చలు జరిపిన అమిత్ షా రాజకీయాలు ఏవీ ప్రస్థావించకుండా ఉంటారా అన్నదే అందరి అనుమానం. అయితే జూనియర్ కి ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదు, అయితే తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తే చాలు అన్నట్లుగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు.

వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీలో అసలు మ్యాటర్ ఏంటి అన్నది అటు అమిత్ షా కానీ ఇటు జూనియర్ ఎన్టీయార్ కానీ రివీల్ చేస్తేనే తెలిసేది. ఏది ఏమైనా కొడాలి నాని విశ్లేషణ కూడా దగ్గరగానే ఉంది. జూనియర్ ని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.