Begin typing your search above and press return to search.
మోడీ సర్కారుపై పోరు చేస్తాననే సారు లేఖ రాసుడేంది?
By: Tupaki Desk | 10 Dec 2020 4:22 AM GMTవ్యూహచతురతలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టాలెంట్ ను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎక్కడ.. ఎప్పుడు తగ్గాలన్న విషయంపై సారుకున్న క్లారిటీ మరెవరికీ ఉండదని చెబుతారు. ఈ లక్షణమే.. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిందని చెప్పాలి. మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. కేంద్రం తీరుపై తాను పోరాడతానని.. జాతీయస్థాయిలో కొత్త కూటమిని కడతానని వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాసిన వైనం ఆసక్తికరంగా మారింది.
నిన్నటికి నిన్న రైతు సమస్యల మీద కేంద్రం తీరును తప్పు పడుతూ భారత్ బంద్ కు మద్దతు ఇచ్చిన ఆయన.. తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాద.. లేఖలో పేర్కొన్న అంశాల్నిచూసినప్పుడు సీఎం కేసీఆర్ ముందుచూపు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తినటం.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ.. కేసీఆర్ లోని వ్యూహకర్త నిద్ర లేచినట్లుగా చెప్పాలి.
ఇంతకూ ప్రధాని మోడీకి లేఖ రాయాల్సిన అవసరం ఏమిటి? లేఖలో ఏ అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వర్చువల్ పద్దతిలో జరిగే కొత్త పార్లమెంటు భవన శంకుస్థాపనకు తాను హాజరవుతానని సీఎం కేసీఆర్ పేర్కొనటం గమనార్హం. కొత్త పార్లమెంటు భవనం దేశ ఆత్మగౌరవానికి.. జాతికి గర్వకారణంగా అభివర్ణించారు. చూస్తుంటే.. తాను పాత సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది కడుతున్న నేపథ్యంలో.. ఆ అంశంపై విమర్శలకు అవకాశం ఇవ్వకుండా.. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికినట్లుగా భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఒంటికాలి మీద కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్..వరుస ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో తత్త్వం బోధ పడినట్లుగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోవటమే కాదు.. కేసీఆర్ పాలనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ఇంటిని సర్దుకోకుండా కేంద్రంమీద కత్తి దూయటానికి మించిన తప్పు పని ఉండదన్న వాస్తవాన్ని కేసీఆర్ గ్రహించినట్లుగా భావిస్తున్నారు. ఏమైనా.. కేంద్రంపై తాను దూసిన విమర్శల కత్తిని వెనక్కి తీసుకున్న వైనాన్ని ప్రధానికి రాసిన లేఖతో కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.