Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రెస్ మీట్ వేళ కొప్పుల ఈశ్వర్ కు అవమానం జరిగిందా?

By:  Tupaki Desk   |   5 Nov 2022 4:32 AM GMT
కేసీఆర్ ప్రెస్ మీట్ వేళ కొప్పుల ఈశ్వర్ కు అవమానం జరిగిందా?
X
సంచలన ప్రెస్ మీట్ గా అభివర్ణిస్తున్న ఎమ్మెల్యే ఎర ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం ఇంపాక్టు మీద ఇప్పుడు చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ప్రెస్ మీట్ నిర్వహణకు ముందు జరిగిన ఒక ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఆ వీడియోలో.. మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మంత్రుల వైపు పంపుతూ.. 'ఇట్రావయ్య బాబు.. చెప్తే అర్థం కాదు' అంటూ మరోవైపు పంపటం.. కొప్పుల ఈశ్వర్ ఆవైపు కూర్చున్న విషయంపై విపక్షాల వాదన వేరులా ఉంది.

దళిత మంత్రి అయిన కొప్పుల ఈశ్వర్ ను అవమానించారంటూ కాంగ్రెస్.. బీజేపీ.. బీఎస్పీ పార్టీల నేతలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ రియాక్టు అయ్యారు. వీడియో చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జరిగింది ఒకటైతే.. వీడియోలో చూపిస్తున్నది మరొకటి అంటూ మండిపడుతున్నారు.

ప్రెస్ మీట్ వేళ జరిగింది ఒకటైతే.. దానికి భిన్నంగాప్రచారం చేస్తున్నారన్నారు. ప్రెస్ మీట్ వేళ.. ఎర వేసిన ఎమ్మెల్యేలు ఒకవైపు. మంత్రులు మరోవైపు కూర్చునేలా చేశారు. పొరపాటున ఎమ్మెల్యేలపై వైపు తాను ఉంటే.. తనను మంత్రుల వైపు పంపారన్నారు. తండ్రిలాంటి కేసీఆర్ తనను అవమానించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలా చేసే వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

సోసల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను మంత్రుల వైపు వెళుతున్నప్పుడు హరీశ్ రావు తన కోసం పక్కకు జరిగి కుర్చీ ఇచ్చారని.. ఈ విషయాన్ని కూడా ప్రతిపక్షాలు గమనించాలన్నారు. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా.. ఎవరికి వారు వారికి అనుకూలంగా ఊహించుకుంటూ అసత్యాలు ప్రచారం చేయటాన్ని తప్పు పట్టారు.

తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.