Begin typing your search above and press return to search.
తెలంగాణకు షర్మిలను పంపాలని కేసీఆర్ కోరారా?
By: Tupaki Desk | 8 Dec 2020 7:30 AM GMTఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న చందంగా ఇటీవల వెలువడుతున్న కథనాల్ని చూసినప్పుడు అనిపించక మానదు. గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండే.. కుత్భుల్లాపూర్.. కుకట్ పల్లి.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు ఈ మూడు నియోజకవర్గాల్లోనే వచ్చాయి. దీనికి కారణం.. సెటిలర్లు టీఆర్ఎస్ పక్షాన ఉండటం.
అయితే.. దీనికి కొత్త సిద్ధాంతాల్ని చెబుతూ.. టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరటంతోనే.. టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లుగా కొత్త సిద్ధాంతాన్ని.. చర్చను తెర మీదకు తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావటానికి.. పార్టీ అధినేత జగన్మోహన్ కి ఆయన సన్నిహితుల ద్వారా సీఎం కేసీఆర్ ఒక సందేశాన్ని పంపినట్లుగా చెబుతున్నారు. దాని సారాంశం.. జగన్ సోదరి షర్మిలను తెలంగాణకు పంపితే..బీజేపీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెక్ పెట్టినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.
ఈ వాదనలో నిజం ఎంతన్నది చూద్దాం. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల ఓటమితోనే తెలంగాణ అధికారపక్షం ఆగమాగం అయిపోతున్నట్లుగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదంటున్నారు. అంతేకాదు.. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తన ఇమేజ్ ను వదులుకుంటారా? అన్నది అసలు ప్రశ్న. ఇవాల్టి రోజున తెలంగాణకు షర్మిలను పంపితే.. తొలుత అడిగేది.. అసలింతకాలం ఏమైపోయారు? ఎందుకని అందుబాటులో లేరని?
అంతేకాదు.. రాజకీయం అన్నది మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఆరోపణల్ని సంధించాల్సి ఉంటుంది. మిత్రుడు కదా అని వదిలేస్తే.. పార్టీకి ఉన్న పరువు పోతుంది. కొత్త సందేహాలు మొదలవుతాయి. ఇద్దరు అధినేతలు గూఢ పుఠాణి చేస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడితే.. ఇద్దరికి నష్టమే. ఏతావాతా జగన్ పార్టీ తెలంగాణలో యాక్టివేట్ చేయటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. ఊహాజనిత అంశాల్ని కథనాలుగా ప్రజల మీదకు వదలటం.. రాజకీయ ఎజెండా తప్పించి.. మరేమీ లేదన్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న షర్మిలాను ఇప్పుడు తెలంగాణకు పంపటానికి జగన్ ఏ మాత్రం ఇష్టపడరని చెబుతున్నారు.