Begin typing your search above and press return to search.
జోయ్ అలుక్కాస్ అలాంటి పాడు పని చేసిందా? వందల కోట్ల ఆస్తులు స్వాధీనం!
By: Tupaki Desk | 25 Feb 2023 9:43 AM GMTదేశంలోనే అత్యుత్తమ బంగారు ఆభరణాల చైన్ సంస్థల్లో ఒకటైన జోయ్ అలుక్కాస్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 68 బ్రాంచ్ లు ఉన్నాయి. జ్యూయలరీ బిజినెస్ లో ఈ బ్రాండ్ కున్న పాపులార్టీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ కున్న పేరుప్రఖ్యాతుల్ని చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ సంస్థకు చెందిన దాదాపు రూ.300 కోట్లకు పైనే విలువైన ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకున్న ఉదంతం చోటుచేసుకుంది.
ఈ సంస్థ చేపట్టిన సరికొత్త ప్రాజెక్టు కోసం భారీ ఎత్తున హవాలా రూపంలో నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పాతిక ఎకరాల్లో నిర్మించే ప్రాజెక్టు కోసం తప్పుడు మార్గాల్లో నిధులు మళ్లించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జోయ్ అలుక్కాస్ అధినేత అధికార నివాసంతో పాటు.. కార్పొరేట్ ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో దాదాపు రూ.300 కోట్లకు పైనే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటూ షాకివ్వటం గమనార్హం.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో 33 స్థిరాస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.81 కోట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు రూ.91 కోట్లకు పైనే విలువైన మూడు బ్యాంకు ఖాతాలు.. ఫిక్సెడ్ డిపాజిట్లు.. రూ.217 కోట్ల విలువైన షేర్లను ఈడీ సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏమంటే.. హవాలా మార్గంలో భారత్ నుంచి దుబాయ్ కు భారీ నగదు మొత్తాన్ని బదిలీ చేసి.. ఆ తర్వాత 100 శాతం జాయ్ అలుక్కాస్ వర్గీస్ కు చెందిన జోయల్లుకాస్ జ్యువెలరీలో పెట్టుబడి పెట్టినట్లుగా చెబుతున్నారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఇదంతా కూడా రూ.2300 కోట్ల ఐపీవోను ఉపసంహరించుకున్న తర్వాతి రోజే చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. పేరున్న సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని ఇట్టే స్వాధీనం చేసుకున్న ఈడీ తీరుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. మరి.. ఈ పరిణామానికి జోయ్ అలుక్కాస్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.