Begin typing your search above and press return to search.
ముందస్తుకు జగన్ నో చెప్పారా...?
By: Tupaki Desk | 7 July 2023 6:58 PM GMTఏపీ లో ముందస్తు ఎన్నికలు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. దీని మీద నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఢిల్లీ స్థాయి లో అయితే ఏదో జరుగుతోంది అన్నదైతే ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందస్తుని కోరుకుంటోంది అన్నది హస్తిన వర్గాల టాక్.
ముందస్తు ఎన్నికల కు వెళ్ళడం ద్వారా విపక్షాల కు చెక్ చెప్పాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన గా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్ళారు. ఆయన హోం మంత్రి అమిత్ షా తోనూ ప్రధాని మోడీ తోనూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చి ఉండొచ్చు అంటున్నారు.
కేంద్రం జమిలి ఎన్నికల ఆలోచన లో భాగంగా 2024 ఏప్రిల్ మే నెలల లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల ను కలుపుకు ని ముందస్తు ఎన్నికల కు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. అయితే దీని మీద జగన్ అభిప్రయాం ఏమిటి అన్నది ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అయిదేళ్ళూ ఉంటుదని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
అంటే షెడ్యూల్ ప్రకారమే ఎనికల కు వెళ్తామ్ని కూడా సజ్జల చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ కి ముందస్తుకు వెళ్ళే ఆలోచన ఏదే లేదని అర్ధం అవుతోంది. ఆ విషయాన్ని ఇప్పటికి చాలా సార్లు వైసీపీ పెద్దలు స్పష్టం చేశారు. జగన్ కూడా మంత్రి వర్గ సమావేశం లో గత నెలలో మంత్రుల కు ముందస్తున కు తాము సుముఖం కాదని చెప్పుకొచ్చారు.
ఇక జమిలి ఎన్నికల కు ఉత్సాహం చూపిస్తున్న కేంద్ర పెద్దలు కూడా జగన్ అభిప్రాయం ఈ విషయం లో తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం ఈ ప్రతిపాదన కు సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతున్నరు. షెడ్యూల్ ప్రకారమే ఏపీ లో ఎన్నికల కు వెళ్తామని ఆయన చెప్పారని అంటున్నారు.
ఇక బీజేపీ విషయానికి వస్తే ఇపుడు ఎన్నికల కు వెళ్లాల ని ఉంది. ఈ డిసెంబర్ లో అయిదు రాష్ట్రాల కు ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది మరి కొన్ని ఉన్నాయి. అన్నీ కలుపుకుని ఎన్నికలు ముందుకు తెచ్చి జమిలి కి వెళ్ళాల ని బీజేపీ ప్లాన్ అంటున్నారు.
అయితే బీజేపీ ప్రతిపాదన కు ఆయా రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంది. అధికారాన్ని ఆరు నెలల పాటు వదులుకుని ఎన్నికల కు సిద్ధపడాల్సి ఉంది. అందుకే ముందుగా జగన్ తోనే ఈ విషయం ప్రస్తావించారు అని అంటున్నారు. అయితే జగన్ మాత్రం ముందస్తు ఎన్నికలు వద్దు అనే అంటున్నారు. వచ్చే ఏడాది కి అన్ని రకాలుగా సిద్ధమైన తరువాతనే మే లో ఎన్నికల కు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
ఇక ఏ విధంగా చూసుకున్నా వైసీపీ ముందస్తుకు సిద్ధంగా లేదని అంటున్నారు. జనవరి లో సామాజిక పెన్షన్ మూడు వెలకు పెంచాల ని అనుకుంటోంది. మరిన్ని కొత్త పధకాల కు కూడా శ్రీకారం చుట్టాలనుకుంటోంది. పోలవరం మొదటి దశను పూర్తి చేయాల ని కూడా భావిస్తోంది. అదే విధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో యాత్ర 2 మూవీ రిలీజ్ అవుతోంది.
అందులో జగన్ గురించే ఉంటుంది. అలా జగన్ పోరాటాన్ని జనాలకు మరోమారు గుర్తు చేసే మూవీ గా ఎన్నికల ముందు ఇది రిలీజ్ అవుతుంది. ఇక అభివృద్ధి అజెండా ను కూడా ఎంతో కొంత జనాల కు చూపించే ప్రయత్నం లో వైసీపీ ఉంది. అసలు ముందస్తు ఎన్నికలు ఎందుకు తమకు అన్న భావన లో ఆ పార్టీ ఉందని అంటున్నారు. కానీ ముందస్తు అంటూ జమిలి ఎన్నికల కు ఉరకలు వేస్తున్న బీజేపీకి ఏపీ నుంచే నో అన్న మాట వచ్చింది. ఇపుడు ఒడిషా తదితర రాష్ట్రాలు ఏమంటాయో చూడాలి మొత్తానికి జమిలి ఎన్నికలు అంత సులువు కాదనే అంటున్నారు.