Begin typing your search above and press return to search.

విశాఖ టూర్ లో స్వాములోరిని జగన్ ‘ముహుర్తం’ గురించి అడిగారా?

By:  Tupaki Desk   |   18 Feb 2021 10:30 AM GMT
విశాఖ టూర్ లో స్వాములోరిని జగన్ ‘ముహుర్తం’ గురించి అడిగారా?
X
ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే ప్రచారం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. ఇద్దరు ప్రముఖులు కలిసి.. కాసేపు మాట్లాడుకుంటే చాలు.. మనసుకు తోచింది రాసేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. రాసే వాడి ఇష్టాలకు తగ్గట్లుగా రాసేయటం ఎప్పటి నుంచో ఉన్నా.. పాత్రికేయంలో మాత్రం ఈ ట్రెండ్ ఇటీవల అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గతంలో తాము రాసే అక్షరాల్లో అర్థం ఉండాల్సిన అవసరం ఉందని బలంగా నమ్మే కలం వీరులకు బదులుగా.. తోచింది రాసేసి.. వాట్సాప్.. సోషల్ మీడియాలోకి వదిలితే.. అదెంత ట్రెండ్ అయితే.. అంత సక్సెస్ అయినట్లుగా ఫీలయ్యే దరిద్రపు గొట్టు రోజులు వచ్చేశాయి.

దీంతో.. నిజాల కంటే అబద్ధాలు.. వాస్తవాల కంటే కూడా అంచనాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి దరిద్రమే ఒకటి ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీ గురించి కొన్ని మీడియా సంస్థల్లో ఇష్టం వచ్చినట్లు రాసేశారు.

మూడు రాజధానుల విషయంలో కచ్ఛితంగా ఉన్న సీఎం జగన్.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం.. మూడు రాజధానుల విషయంపై కోర్టులో కేసు నడుస్తుండటంతో..రాజధాని తరలింపు కుదరని వైనం తెలిసిందే. ఇదే విషయాన్ని స్వాములోరి ముందుకు తీసుకొచ్చిన ఆయన.. అమరావతి నుంచి విశాఖకు పాలనా రథాన్ని మరలించటానికి మంచి ముహుర్తాన్ని చూడాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

కోర్టు కేసులు ఫైనల్ కాకుండా.. ఎన్ని ముహుర్తాలు చూస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఒకవేళ ముహుర్తం పెట్టమని అడిగారనే అనుకుందాం? దానివల్ల ఏమైనా లాభం ఉందా? కోర్టులో కేసు తేలకుండా ఎన్ని ముహుర్తాలు పెట్టినా ప్రయోజనం ఉండదు కదా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముహుర్తం కోసం విశాఖ పర్యటనలో స్వాములోరు కనిపించినంతనే జగన్ అడిగేస్తారా? అయినా.. స్వాములోరు ఎక్కడికైనా వెళ్లేవారా? జగన్ అడగాలే కానీ.. ఏ సమయంలో మాత్రం ఆయన ముహుర్తం పెట్టరు. ముహుర్తం ఎప్పుడన్నది డిసైడ్ చేయటానికి ముందు.. జరగాల్సినవి చాలానే ఉన్నాయి. వాటిని వదిలేసి.. డేట్ ను డిసైడ్ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇదంతా చూసినప్పుడు.. రాజధాని తరలింపు కోసం మంచి ముహుర్తం చూడాలని స్వాములోరిని జగన్ అడిగారన్న వాదనలో పస ఎంత ఉందో అర్థమైందిగా?