Begin typing your search above and press return to search.

చైనాలో పురుగుల వర్షం కురిసిందా? వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   12 March 2023 3:03 PM GMT
చైనాలో పురుగుల వర్షం కురిసిందా?   వైరల్ వీడియో
X
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వీడియో చైనాలో పురుగుల వర్షం కురుస్తున్నట్టుగా కనిపిస్తోంది.. చైనా రాజధాని నగరం బీజింగ్ నుండి వచ్చిన వీడియోలో రోడ్లు మరియు వాహనాలు పురుగుల వంటి వాటితో కప్పబడి ఉన్నాయని చూపించింది. బీజింగ్‌లోని కార్లు కొన్ని పురుగుల లాంటి జీవులతో కప్పబడి ఉండటం వీడియోలో చూడవచ్చు.

బీజింగ్‌లోని రోడ్ల పక్కన పార్క్ చేసిన కార్లపై పురుగుల వంటి మురికి గోధుమ రంగు జీవుల సమూహాలు కనిపించాయి. ఆకాశం నుంచి పడే పురుగుల బారిన పడకుండా ప్రజలు గొడుగులు పట్టుకుని వెళ్లడం కూడా కనిపించింది.

"పురుగుల వర్షం వెనుక కారణం ఇంకా తెలియలేదు, అయితే సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్‌వర్క్ ప్రకారం.. భారీ గాలులకు కొట్టుకుపోయిన తర్వాత బురద జీవులు ఇలా పడిపోయాయని అంటున్నారని" అని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

"పీరియాడికల్ ప్రకారం.. తుఫాను తర్వాత కీటకాలు వర్ల్‌పూల్‌లో చిక్కుకున్నప్పుడు ఈ రకమైన సంఘటన జరుగుతుందని కూడా పేర్కొంది" అని నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉండగా ఆ వీడియో ఫేక్ అని, బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షపాతం లేదని చైనా మీడియా పేర్కొంది. "నేను బీజింగ్‌లో ఉన్నాను. ఇక్కడ పురుగుల వర్షం లేదు. ఈ వీడియో నకిలీది. ఈ రోజుల్లో బీజింగ్‌లో వర్షాలు పడలేదు" అని షెన్ షివే అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో అసలైనదా? నకిలీదా? అన్న దానిపై క్లారిటీ లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.